Dhoni: యువరాజ్ పై మండిపడుతున్న ధోనీ ఫ్యాన్స్..ఎందుకంటే

Dhoni: ఇప్పుడు ఎక్కడ ఏ రంగం తీసుకున్నా అందులో పాలిటిక్స్ అనేవి ఉంటాయి. క్రికెట్ రంగంలో కూడా పాలిటిక్స్ చాలానే జరుగుతుంటాయి. పాలిటిక్స్‌లోలాగే క్రికెట్‌లో కూడా శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెరీర్‌ పరంగా ఆరంభంలో ఆప్త మిత్రులుగా ఉన్న యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు ఇప్పుడు బద్ధ శత్రవులుగా తయారయ్యారు. మహీ గురించి తెలీదు కానీ, యువీ మాత్రం ధోనీని ద్వేషిస్తున్నాడని ఓ సంఘటన స్పష్టం చేస్తోంది.

 

మహేంద్ర సింగ్ ధోనీ కంటే నాలుగేళ్ల ముందే టీమిండియాలోకి యువరాజ్ సింగ్ వచ్చాడు. అయితే టీమిండియాకు కెప్టెన్సీని మాత్రం యువరాజ్ సింగ్ దక్కించుకోలేకపోయాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో యువరాజ్ పాత్ర ఎక్కువగా ఉంది. ఆ తర్వాత యువరాజ్ ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడి విజయం సాధించాడు. డిసెంబర్ 12న యువరాజ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జెమ్స్ ఆఫ్ క్రికెట్’ అనే సోషల్ మీడియా పేజీ, ఓ స్పెషల్ వీడియోను రెడీ చేసింది.

అందులో చిన్ననాటి యువరాజ్ సింగ్, ఇప్పటి యువీతో మాట్లాడితే ఎలా ఉంటుందనే థీమ్‌తో వీడియో చేసింది. ‘నేను క్రికెటర్‌ని అయ్యానా…’ అని చిన్ననాటి యువీ ప్రశ్నిస్తే, సెంచరీ కొట్టిన యువరాజ్ సింగ్ బ్యాటుతో ‘అవును’ అని సమాధానం ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. రికార్డులు క్రియేట్ చేశానా? దేవుడిని గౌరవించానా? స్నేహితులను సంపాదించుకున్నానా? జనాలు నన్ను అభిమానిస్తున్నారా? దేశం గర్వపడేలా చేశానా? అనే ప్రశ్నలకు యువరాజ్ అవుననే జవాబు ఇస్తాడు.

 

ఈ వీడియోను యూవీ తన అకౌంట్లో పోస్టు చేశాడు. అయితే ఈ వీడియో లెంగ్త్ ను తగ్గించి యూవీ పోస్టు చేశాడు. ఎక్కడ తగ్గిందా? అని గమనించిన ఫ్యాన్స్… ‘స్నేహితులను సంపాదించుకున్నానా?’ అనే ప్రశ్న దగ్గర తొలుత మహేంద్ర సింగ్ ధోనీ వెనకాల యువీ కూర్చొని బైక్ మీద వెళ్తున్న ఫోటో కనిపిస్తుంది. అయితే ఆ షాట్ ను యూవీ తొలగించాడన్నమాట. అంటే ధోనీకి తనకు ఫ్రెండ్షిప్ లేదని పరోక్షంగా హింట్ ఇచ్చాడన్నమాట. దీంతో ధోనీని కట్ చేసిన వీడియో పోస్టుకు మహీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. యూవీని తప్పుబడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -