Balayya: బాలయ్య సింహా మూవీ దెబ్బకు ఆ సినిమాలకు ఇంత నష్టమా?

Balayya: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ ఐదో వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన బాలయ్య ఇప్పటివరకు 106 సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బాలయ్య హీరోగా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ‘లక్ష్మీ నరసింహా, విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ పూర్తిగా క్లోజ్ అయ్యిందనుకునే సమయంలో లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి బాలయ్య 2010లో ‘సింహా’ సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా బాలయ్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ‘లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ వంటి సినిమాలు కమర్షియల్ హిట్ అందుకుంది. గతేడాది ‘అఖండ’ మూవీతో వచ్చిన బాలయ్య.. ఇండస్ట్రీయల్ హిట్ కొట్టారు. ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు.

 

 

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య మరో రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. అయితే బాలయ్యకు ఉండే క్రేజ్, మాస్ ఫాలొయింగ్ ఏ హీరోకు ఉండదు. 2010లో బాలయ్య హీరోగా నటించిన చిత్రం ‘సింహా’. ఈ మూవీ వల్ల దాదాపు 10 సినిమాలు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదని ప్రచారం జరుగుతున్నారు. ‘ప్రస్థానం, రామరామ కృష్ణకృష్ణ, డార్లింగ్, నమో వెంకటేశ, గోలీమార్’ వంటి సినిమాలు కేవలం హిట్ టాక్ మాత్రమే అందుకున్నాయి. అందుకు కారణం బాలయ్య సినిమా ‘సింహా’నే. అప్పటికీ థియేటర్లలో బాలయ్య మానియా కొనసాగుతోంది. సింహా ధాటికి ఏ స్టార్ హీరో సినిమా కూడా బిగ్ హిట్ అందుకోలేకపోయాయి. అటు ఇటుగా ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘బాలయ్యనా మజాకా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -