Anasuya: పెళ్లి కోసం అనసూయ తండ్రినే ఎదురించిందా?

Anasuya: బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ.. సినిమాల్లో కూడా రాణిస్తోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నాగార్జున మరదలిగా.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా గ్లామరస్ పాత్రలో అలరించింది. వరుసగా సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే అనసూయ.. బీహారీ అయిన శశాంక్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, పెళ్లి పీటలు ఎక్కడానికి చాలా సమయం పట్టిందని అనసూయ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు యూత్ కాంగ్రెస్ లీడర్. ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో పెద్దావిడా అనసూయే. ఆమె చెల్లెళ్లు అంబిక, వైష్ణవి. అనసూయను మొదట్లో ఆర్మీ ఆఫీసర్ చేయాలని సుదర్శన్ రావు అనుకున్నారట. ఎన్‌సీసీ ఉంటే ఆర్మీకి ఉపయోగపడుతుందని ఓల్డ్ మలక్‌పేట స్కూల్ నుంచి వనస్థలిపురంలోని వికాస భారతి స్కూల్‌కు మార్చారు.

 

అనసూయ ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఎన్‌సీసీ క్యాంపులో శశాంక్ భరద్వాజ్ పరిచయమయ్యాడు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు ఇద్దరూ మొదటిసారిగా కలిశారట. అప్పుడే వీరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. అనసూయ మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ చదివింది. ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడే అనసూయను భరద్వాజ్ ప్రపోజ్ చేశాడు. దాంతో అనసూయ ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అప్పుడు పెద్ద గొడవ అయిందట. భరద్వాజ్‌ది బీహార్ అని తెలిసిన తర్వాత మరింత భయపడ్డారట. అప్పుడు అనసూయను వెంటనే పెళ్లి చేసేయాలని తండ్రి వేరే సంబంధాలు తీసుకొచ్చాడు. అప్పుడు అనసూయ.. భరద్వాజ్‌ను ప్రేమిస్తున్నానని తెగేసి చెప్పింది. ఆ గొడవల మధ్యనే డిగ్రీ పూర్తయింది. కాచిగూడలోని భద్రుకా కాలేజీలో ఎంబీఏ కోర్సుకు జాయిన్ అయింది. అప్పుడే ‘పిక్సలాయిడ్’ అనే సంస్థలో జాబ్ ఆఫర్ వచ్చింది. జాబ్ చేస్తూనే చదువుకుంది. ఆ తర్వాత 2010లో భరద్వాజ్‌లో పెళ్లి చేసుకుంది. దాదాపు 9ఏళ్ల పాటు ఇంట్లో పోరాడి.. చివరకు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందట. వీరికి ‘శౌర్య, అయాంచ్’ ఇద్దరు పిల్లలు. 2013లో అనసూయకు ‘జబర్దస్త్’లో యాంకర్‌గా ఆఫర్ వచ్చింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. ప్రస్తుతం సినిమాలు, ఇతర షోలల్లో యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -