Balayya: కూతుళ్ల వయస్సు ఉన్న ఈ హీరోయిన్లతో బాలయ్య నటించాడా?

Balayya: సినీ ఇండస్ట్రీలో అందరి కథా ఒకలా ఉండదు. హీరోలు హిట్లు, ప్లాపులు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉంటారు. అదే హీరోయిన్లు మాత్రం అలా కాదు. ఒకసారి ప్లాప్ వచ్చినా తర్వాతి అవకాశం రావడం కొంచెం ఇబ్బందే అవుతుంది. కొన్నిసార్లు మార్కెట్లో వారికి డిమాండ్ బాగా ఉంటుంది. మరికొన్ని సార్లు అలా ఉండదు. ఏదైనా గ్లామర్ ఉన్నంత వరకే వారికి అవకాశాలనేవి ఉంటాయి.

 

సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ బాలయ్య కెరీర్ అద్భుతంగా సాగుతోంది. కరోనా వచ్చిన సమయంలో కూడా అఖండ సినిమా రికార్డులు తిరగరాసింది. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా సాగుతున్నారు. అయితే బాలయ్య సినిమాల్లో నటించిన హీరోయిన్లకు బాలయ్యకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఒకసారి అలా ఏజ్ గ్యాప్ తో నటించిన హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ప్రగ్యా జైస్వాల్ – 30 ఏళ్ళు:
బాలయ్యతో ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాలో చేసింది. వీరిద్దరికీ 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

 

శృతి హాసన్ – 25 ఏళ్ళు:
కమల్ హాసన్ కూతురు అయిన శృతి హాసన్ బాలయ్యతో వీరసింహారెడ్డి అనే సినిమాలో నటించింది. వీళ్ల మధ్య ఏజ్ గ్యాప్ 25 ఏళ్లుగా ఉంది.

 

ఇషా చావ్లా – 28 ఏళ్ళు:
కుర్ర హీరోల సరసన నటించిన ఇషా చావ్లా బాలయ్యతో శ్రీమన్నారాయణలో కథానాయికగా చేసింది. వీరిద్దరికి 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

 

సోనాల్ చౌహన్- 26 ఏళ్ళు:
ముద్దులగుమ్మ సోనాల్ చౌహన్ బాలయ్యతో లెజెండ్, రూలర్ వంటి సినిమాల్లో కనిపించింది. వీరి మధ్య ఏజ్ గ్యాప్ 26 ఏళ్లుగా ఉంది.

 

రాధికా ఆప్టే – 24 ఏళ్ళు:
లెజెండ్, లయన్ వంటి సినిమాల్లో బాలయ్యకు జోడిగా రాధికా ఆప్టే నటించింది. వీరిద్దరికీ 24 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

 

నయనతార – 23 ఏళ్ళు:
లేడీ మెగాస్టార్ గా పేరొందిన నయనతార బాలయ్యతో సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ వంటి మూడు సినిమాల్లో నటించింది. వీరి మధ్య ఏజ్ గ్యాప్ 23 ఏళ్లుగా ఉంది.

 

నటాషా దోషి – 32 ఏళ్ళు:
జై సింహా సినిమాతో నటాషా దోషి బాలయ్యతో కలిసి నటించింది. వీరిద్దరి మధ్య 32 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

 

స్నేహ ఉల్లాల్ – 27 ఏళ్ళు:
సింహా సినిమాలో బాలయ్యతో కలిసి స్నేహా ఉల్లాల్ నటించింది. వీరి ఇరువురి మధ్య 27 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

 

నమిత – 20 ఏళ్ళు:
బాలకృష్ణతో హీరోయిన్ ముద్దులగుమ్మ నమిత సింహ చిత్రంలో కనిపించింది. వీరి మధ్య ఏజ్ గ్యాప్ 20 ఏళ్లుగా ఉంది.

 

కత్రినా కైఫ్ – 22 ఏళ్ళు:
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బాల కృష్ణతో అల్లరి పిడుగు అనే సినిమా చేసింది. వీరిద్దరికి 22 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది.

 

స్నేహ – 20 ఏళ్ళు:
పాండురంగడు, మహారథి సినిమాల్లో స్నేహ బాలయ్యకు జోడిగా నటించింది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 20 ఏళ్ళుగా ఉంది.

 

హరి ప్రియ – 30 ఏళ్ళు:
జై సింహ సినిమాలో బాలయ్యతో జతకట్టిన హీరోయిన్లలో హరి ప్రియ కూడా ఉంది. వీరి ఇరువురికి 30 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

 

శ్రేయ – 21 ఏళ్ళు:
అందాల తార శ్రేయ బాలయ్యతో పైసా వసూల్, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు చేసింది. వీరి మధ్య 21 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -