Roja-Balayya: రోజా కళ్ల గురించి బాలయ్య అలాంటి కామెంట్లు చేశారా?

Roja-Balayya: ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు కలిగిన మహిళా రాజకీయ నాయకురాలు రోజా. వైసీపీ తరఫున నగరి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా ప్రస్తుతం మంత్రిగా క్యాబినెట్ లో కొనసాగుతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను విపరీతంగా తిట్టడంతో రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మీడియా అటెక్షన్ వచ్చేలా రోజా కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.

 

మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడును, లోకేశ్ ని మరియు పవన్ కళ్యాణ్ ని తిట్టడంలో రోజా ముందు వరుసలో ఉంటుంది. అదే సమయంలో నందమూరి బాలయ్యను కూడా రాజకీయంగా రోజా విమర్శిస్తూ ఉంటుంది. రోజా మరియు బాలయ్యలకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుండి మంచి పరిచయాలు ఉండగా.. నిజ జీవితంలో కూడా వీరి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది.

 

నందమూరి బాలయ్య తన గురించి గతంలో ఏమని కామెంట్ చేశారనే విషయాన్ని రోజా వివరించింది. బాలయ్య తన గురించి చెబుతూ.. ‘మీ కళ్లు, ముక్కు, నవ్వు వల్ల రాణి గెటప్ వేసినా, దేవత గెటప్ వేసినా భలే సెట్ అవుతారని, దేవుడు మీకు అలా ఇచ్చేశారు’ అని కామెంట్ చేసే వాడని రోజా తెలిపింది. తన బర్త్ డేకు బాలయ్య విష్ చేశారని, అసెంబ్లీలో కనిపిస్తే మాట్లాడతారని, పార్టీ మారినందు వల్లే తాను మొహమాటపడుతూ ఉండే దానిని అని రోజా పేర్కొంది.

 

ఇక బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు తనకు ఎప్పుడో ఆహ్వానం అందిందని, అన్ స్టాపబుల్ షోకి వెళితే దానిని వివాదం చేసే ఛాన్స్ ఉందని రోజా వివరించింది. షోకి వెళ్లడానికి తనకు ఇబ్బందిలేదని, ప్రస్తుతం మంత్రిగా ఉన్నందున షోకి వెళ్లలేకపోతున్నట్లు తెలిపింది. అటు జగన్ తనకు ఎలాంటి షరతులు పెట్టలేదని, తన మీద పూర్తి నమ్మకం కలిగి ఉన్నారంది. జబర్దస్త్ వల్ల తన మీద నెగిటివ్ కామెంట్లు వచ్చినా జగన్ వాటిని పట్టించుకోలేదని గుర్తు చేసింది.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -