Chandra Mohan: ఆ హీరోయిన్ల విషయంలో చంద్రమోహన్ దారుణంగా వ్యవహరించారా?

Chandra Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చంద్రమోహన్ ఒకరు. మొదట్లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన చంద్రమోహన్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటించి సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చంద్రమోహన్ వయసు పై పడటంతో ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఇకపోతే చంద్రమోహన్ సినిమా షూటింగ్లో ఉంటే హీరోయిన్ల విషయంలో ఏ విధంగా ప్రవర్తించేవారో తాజాగా నటి శ్రీ లక్ష్మీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి శ్రీ లక్ష్మీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

 

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ..తనకు కంగారు ఎక్కువగా ఉండటం వల్ల షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ల చేత ఎక్కువగా తిట్లు తినేదానిని ముఖ్యంగా జంధ్యాల గారు తనని ఎక్కువగా తిట్టేవారని అయితే ఆయన తిట్టడం వల్ల నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానని శ్రీ లక్ష్మీ వెల్లడించారు.ఇక విశ్వనాధ్ గారి సినిమాలలో నటించే సమయంలో అయితే విశ్వనాథ్ గారు ఆ అమ్మాయిని కంగారు పెట్టకండి అంటూ పక్క వారికి చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

 

ఇక సినిమా షూటింగ్ లొకేషన్లో చంద్రమోహన్ కనుక ఉంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఆయన డేంజర్ అంటూ శ్రీ లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేశారు. మనం లొకేషన్ లో ఉన్నప్పుడు చంద్రమోహన్ కనుక ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆయన వెనుక నుంచి వచ్చి టక్కున చెంపపై కొట్టి సైలెంట్ గా వెళ్ళిపోతారని తెలిపారు. కనీసం ఆయనపై ఫిర్యాదు చేద్దామన్న వీలు లేకుండా తప్పించుకుంటాడు. అందుకే తనతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈ సందర్భంగా చంద్రమోహన్ గురించి శ్రీ లక్ష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -