Praja Rajyam Party: ప్రజారాజ్యం పార్టీని మూసేసి చిరంజీవి పెద్ద తప్పు చేశారా?

Praja Rajyam Party: సినిమా స్టార్లుగా ఉండి రాజకీయ పార్టీ పెట్టి విజయవంతం అయినవారు ఎందరో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోపాటు తమిళనాడు రాజకీయాల్లో ఇలాంటి గాధలు చూడవచ్చు. 1980లో రాజకీయాల్లో సినీనటులు ఓ సంచలనం. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి 2009లో పార్టీని స్థాపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో చిరంజీవి స్థాపించిన పార్టీ ఓ సంచలనం. ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషకులు భావించారు.

సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావటం ఓ పరిపాటిగా మారింది. అలా వచ్చిన వారిలో చాలా మందే సక్సెస్ అయ్యారు. కొంత మంది మాత్రమే ఫెయిలూర్ అయ్యారు. టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యారని చెప్పలేం కానీ ఆయన రాజకీయ వ్యూహాలు మాత్రం పూర్తిగా బెడిసికొట్టాయని చెప్పవచ్చు. పార్టీ స్థాపించిన తర్వాత అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు, కానీ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ తో పోల్చితే మెగాస్టార్ ఎంతో బెటర్ అనే చెప్పవచ్చు.

 

అయితే ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ వేసిన పాచికల్లో చిక్కుకున్న చిరంజీవి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపి వేశారు. కేంద్రమంత్రి పదవిని అందుకు పారితోషకంగా తీసుకున్నారు. అనంతరం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో మెగాస్టార్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఆయకు కూడా రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయింది.

 

ప్రస్తుతం చిరంజీవి సామాజిక వర్గంతోపాటు ఏపీ ప్రజలు మరోసారి ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని అలాగే నడిపి ఉంటే, ఏపీలో క్రియాశీలకంగా ఉండేదని భావిస్తున్నారు. అంతేకాకుండా సీఎం పదివి కూడా వరించేదని తీవ్రంగా చర్చ జరుపుతన్నారు. అప్పట్లో అనవసరంగా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని, కాపు సామాజిక వర్గంతోపాటు జనసేన నేతలు వాపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -