CM Jagan: నాలుగు సంవత్సరాల పాలనలో సీఎం జగన్ ఇన్ని తప్పులు చేశారా?

CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసి నేటికీ నాలుగు ఏళ్లు పూర్తి అయింది. 2014 ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని ఆమోదించి తన విధానాలను మార్చుకుని, జనమనోగతాన్ని తెలుసుకోవడానికి ఏపీ రాష్ట్ర చరిత్రలో అప్పటికి కనీవినీ ఎరుగనంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసి జనం ప్రేమాభిమానాలను గెలుచుకున్నారు. 175 సీట్లున్న ఏపీ శాసనసభలో 151 సీట్లు సాధించి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. పరిపాలనలో డెబ్భయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎరుగని రీతిలో తనదైన ముద్ర చూపిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్.

అయితే మాములుగా రాజకీయ నాయకులకు అందరికి ఉన్నట్లే ఆయనకు కూడా సుదీర్ఘకాలం తాను ముఖ్యమంత్రిగా పనిచేయాలనే కోరిక ఉంది. ప్రజలు తనను ఎప్పటికీ మరచిపోనంత, విస్మరించలేనంత గొప్ప నాయకుడిగా వారందరి ప్రేమను సొంతం చేసుకోవాలనే అత్యాశ జగన్ కి కూడా ఉంది. 46 ఏళ్లకు ముఖ్యమంత్రి అయిన జగన్.. తన పార్టీ శ్రేణులకు నాయకులకు చేసే దిశానిర్దేశం ఒక్కటే. బాగా కష్టపడి రెండోసారి కూడా విజయం సాధిద్దాం. మళ్లీ 30 ఏళ్ల పాటూ వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేదు అనే దిశా నిర్దేశాన్ని చెబుతూ వస్తున్నారు. ఇలా చేయడం వల్ల మరో ముప్పయ్యేళ్లు మనదే పాలన అంటున్నారు జగన్. సీఎం జగన్ నాలుగేళ్ల పనులలో కేవలం మంచి పనులు కాకుండా చెడ్డ పనులు కూడా చేశారు.

 

మరి నాలుగేళ్లలో జగన్ చేసిన ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జగన్ నాలుగేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన తరువాత తొలిరోజుల్లో చేసిన పని ఉండవిల్లిలో చంద్రబాబునాయుడు నివసించే ఇంటి సమీపంలో ఉన్న ప్రజావేదికను కూల్చేయడం. ఈ కూల్చివేతల మీద జగన్ ఎందుకు మనసుపడ్డారో ఎవ్వరికీ అర్థం కాని సంగతి. అందువల్ల ఆయన విధ్వంసక సీఎంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతే కాకుండా నాలుగేళ్లలో అనేకమంది తెలుగుదేశం నాయకులకు చెందిన ఆస్తులు నిబంధనలు అతిక్రమించి ఉన్నా, ఆక్రమణలు సాగించి ఉన్న వాటిని జగన్ కూల్చివేయించారు. వాటన్నింటినీ కూడా ప్రజలు సహిస్తారు. తెలుగుదేశం నాయకులు తాము అధికారంలో ఉన్న రోజుల్లో నిబంధలన్ని తోసిరాజని చెలరేగితే వారికి బుద్ధిచెప్పే రోజు ఒకటి వస్తుందని జగన్ నిరూపించారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ అనుసరించిన విధానం కూడా సమర్థించలేనిది. ఎందుకంటే రైతులు సుమారు 50 వేల ఎకరాలను నగరం నిర్మాణం కోసం ఇచ్చిన తరువాత ఆ ప్రాంతంలో ప్రాథమికంగా మౌలిక వసతుల పనులు మొదలైన తరువాత తిరిగి వాటిని సేద్యానికి వెనక్కివ్వడం అనేది సాధ్యం కాదు.

 

జగన్ రాజధానిని విశాఖకు మార్చదలచుకుంటే పాలకుడిగా ఆయన ఇష్టం. కానీ అందుకోసం అమరావతిని శిథిలం చేయాల్సిన అవసరం లేదు. అమరావతిలో సగం పూర్తయిన నిర్మాణాల్ని అలా వదిలేయాల్సిన అవసరం లేదు. జగన్ నాలుగేళ్లలో తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ఘోరమైనది అన్న క్యాంటీన్ లను మూసివేయడం. అన్నా క్యాంటీన్లను మూసివేసి ఎంతోమంది ఆకలి ప్రజల కడుపులను కొట్టాడు. గతిలేని పేదవాడికి, చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వారికి ఎందరికో అన్న క్యాంటీన్లు కడుపు నింపుతూ వచ్చాయి. ఆ పథకం చంద్రబాబునాయుడు మేథోజనితం ఎంతమాత్రము కాదు. ఆయన ఇతర రాష్ట్రాల నుంచి కాపీచేసి అన్న క్యాంటీన్లు మొదలెట్టారు. అదేదో చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడం అన్నట్లుగా జగన్ వాటిని మూసేయించారు. ఆకలి తీర్చుకుంటున్న పేదల ఆక్రోశానికి ఆ రకంగా ఆయన గురయ్యారు.
ఏకంగా వాటిని మూసేయకుండా అవసరమైతే వైఎస్సార్ పేరు పెట్టుకుని పేదలకు అన్నం పెట్టి ఉంటే జగన్ పేరు చెప్పుకుని పేదలు కడుపు నింపుకుంటుండే వాళ్లు. మరి నాలుగేళ్లలో జగన్ చేసిన ఇలా ఎన్నో పొరపాట్లను ప్రజలు మన్నించి మరొకసారి ఎన్నుకుంటారా లేదా అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -