Sreeleela-Pooja hegde: హీరోయిన్ శ్రీలీల పూజా హెగ్డేను తొక్కేసిందా.. ఏం జరిగిందంటే?

Sreeleela-Pooja hegde: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో రోషన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను అందుకున్న శ్రీ లీల తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కాగా ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే శ్రీలీల హీరోయిన్ పూజ హెగ్డేను తొక్కేస్తోందా అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీలీల, పూజా హెగ్డేను తొక్కేయడం ఏంటి అని అనుకుంటున్నారా?ఆ వివరాల్లోకి వెళితే.. సినిమా సినిమాకి శ్రీలీల క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో దర్శకులు,హీరోలు శ్రీలీల వైపు చూస్తున్నారు. దాంతో శ్రీలీలకి వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య బాబు,వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టివిజయ్ దేవరకొండ లాంటి హీరోల సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమా డేట్స్ కోసం హీరోలు దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు.. మామూలుగా ఆదివారం సమయంలో సినిమా షూటింగులు జరపరు. కానీ శ్రీలీలకి ఆదివారం డేట్స్ ఖాళీగా ఉండడంతో రోజున కూడా షూటింగ్ నిర్వహిస్తున్నారు.

 

అలా శ్రీలీల కాల్ షీట్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. అసలు చర్చలు ఇక్కడే మొదలయ్యాయి. మొన్నటివరకు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అంటూ బాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ పూజ హెగ్డే. కానీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. దాంతో పూజా హెగ్డే కి అవకాశాలు తగ్గడానికి కారణం శ్రీలీలనే అంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. ఇంకొందరు అదృష్టంతో పాటు క్రేజ్ ఉండాలి క్రేజ్ ఉంటే ఎవరికైనా అవకాశాలు వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. దానికి తోడు పూజ హెగ్డే నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో శ్రీలీల ను చూసి పూజ హెగ్డే అభిమానులు కుళ్ళుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -