Indira Devi- Mahesh Marriage: మహేష్, నమ్రతల పెళ్లి కోసం ఇందిరా దేవి ఎంత కష్టపడ్డారో తెలుసా?

Indira Devi- Mahesh Marriage: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత గురించి పెద్దగా పరిచయంకర్లేదు. వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో నటించారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో చాలామంది ప్రేమ జంటలకు మహేష్, నమ్రతలు ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. మరి ఈ జంట ఇప్పుడు ఇంత ఆనందంగా భార్యాభర్తలుగా ఉండడానికి కారణం మహేష్ తల్లి ఇందిరా దేవి అట.

నిజానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం ఇందిరా దేవి గారు అనారోగ్యం కారణంగా తన ఇంట్లో మరణించారు. ఈ విషయాన్ని సినీ రాజకీయ వర్గాలు ఈరోజు వరకు కూడా తీసుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరా దేవి గారికి సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మహేష్, నమ్రతల పెళ్లి విషయం కూడా బయటకు వచ్చింది. మహేష్ నమ్రతల ప్రేమను మొదట కృష్ణ ఒప్పుకోలేదట.

కృష్ణ మహేష్ కి తెలుగు అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకున్నారట. కానీ మహేష్ బాబు మాత్రం అప్పటికి నమ్రతతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. కనుక నమ్రతను మర్చిపోలేక పోయాడు. దాంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్ళిన మహేష్ అక్కడ నమ్రత ని పెళ్లి చేసుకున్నాడట. ఈ విషయం తెలిసిన కృష్ణ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశాడట. కానీ ఈ విషయం గురించి ఇందిరా దేవి గారు కృష్ణ గారితో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది.

దాంతో కృష్ణ కూడా వారి వివాహాన్ని అంగీకరించారు. ఇక ఇద్దరు దంపతులు ముంబై బయలుదేరి మహేష్, నమ్రతల జంటను ఆశీర్వదించారట. దాంతో మహేష్ కూడా కృష్ణ గారు ఒప్పుకోవడాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా కానీ మహేష్ నమ్రత విహాహా విషయంలో ఇందిరా దేవి గారు బాగా సహాయపడ్డారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -