Jr. NTR: ఆంధ్ర ప్రదేశ్ లో నువ్వా నేనా అను పోటీపడుతూ వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున గెలుపొందడానికి సిద్ధమవుతున్నాయి. అయితే నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు ప్రస్తుతం నారా చంద్రబాబునాయుడు చేతిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా నారా చంద్రబాబు నాయుడు ఈ పార్టీని గత కొంతకాలంగా ముందుకు నడిపిస్తూ వస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో పార్టీలో సరైన నాయకులు లేకపోవడంతో పార్టీ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉందని చెప్పాలి. ఇలా పార్టీలో కీలకమైన నేతలు లేకపోవడంతో గత ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలయింది. అయితే ఈ పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావాలి అంటే తప్పనిసరిగా నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో కొనసాగే అన్ని హక్కులు జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్నాయని పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా వేడుకకు హాజరైన పెద్ద ఎత్తున అభిమానులు సీఎం సీఎం నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే రాజకీయాల గురించి ఎన్టీఆర్ ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు.
బహిరంగంగా ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడకపోయినా, తన సన్నిహితుల దగ్గర మాత్రం రాజకీయ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది. తాను ఇప్పుడప్పుడే రాజకీయాలలోకి రావాలని కోరుకోవడం లేదని తెలిపారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మార్చే అవసరం ఉంటుందో ఆ సమయంలోనే తాను కూడా రాజకీయాలలోకి వస్తానని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం.