Mahesh: నమ్రతాతో మహేష్ అలాంటి చిలిపి పనులు చేశారా?

Mahesh: సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్. చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సంతోషంగా లైఫ్‌ను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ సూపర్‌స్టార్ మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్. వీరిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అయితే నమ్రత శిరోద్కర్‌ది నార్త్ ఇండియా. మాజీ మిస్ ఇండియా అయిన నమ్రతా హిందీ అమ్మాయి. ఆమె రిలీజీయన్, క్యాస్ట్ వేరు. మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడు. ఘట్టమనేని వారసుడు. తెలుగబ్బాయి. వీరిద్దరివి వేర్వేరు నేపథ్యాలు అయినప్పటికీ ఎంచక్కా ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

2000 సంవత్సరంలో ‘వంశీ’ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగింది. అప్పుడు మహేష్-నమ్రతా మనసులు కలిశాయి. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఐదేళ్ల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ కూడా నడిపారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. నిజానికి నమ్రతా.. మహేష్ కంటే వయసులో పెద్దది. కానీ వీరి ప్రేమకు వయసు అడ్డు రాలేదు. ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్లు వివాహబంధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నిజానికి వీరిద్దరి ప్రేమ వ్యవహారం అసలు ఎవరికీ తెలియదు. చాలా సీక్రెట్‌గానే మెయిన్‌టైన్ చేసేవారు. లవ్‌లో ఉన్నప్పుడు వారు చేసిన అల్లరి గురించి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.

మహేష్-నమ్రతా ప్రేమలో ఉన్నారని అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించేవి. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. మూడేళ్లపాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. మహేష్ బాబు ఎవరికీ తెలియకుండా నమ్రతాను కలవడానికి ముంబై ఫ్లైట్‌లో వెళ్లేవాడట. వీకెండ్‌లో, సినిమా షూటింగ్ గ్యాప్‌లో ముంబైకి వెళ్లి.. అక్కడ సక్రెట్‌గా ఫ్లాట్‌లో ఉండేవాడట. ముంబైలో కూడా ఎవరికీ కనబడకుండా తిరిగేవారట. అలాగే హైదరాబాద్‌లో కూడా ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడేవారట. అలా ముంబై వీధుల్లో తిరుగుతూ.. లైఫ్ ఎంజాయ్ చేశారట. నమ్రతను బోర్ కొట్టనివ్వకుండా మహేష్ ఎంతో నవ్విస్తుండే వాడని టాక్. పీకల్లోతులో ప్రేమలో పడ్డ వీరు.. ఒకరిని విడిచి మరొకరు విడిచి ఉండలేకపోయేవారట. మహేష్ బాబు సినిమాల షూటింగ్ విదేశాల్లో ఉన్నా.. నమ్రతా అక్కడికి వచ్చేదట. వీరిద్దరి ప్రేమ వ్యవహారం మహేష్ అక్క మంజులకు తెలిసింది. ఆమెనే వీరిద్దరి పెళ్లికి పెద్ద మనిషిగా వ్యహరించారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -