Manchu Manoj: మంచు మనోజ్ మొదటి భార్యతో విడిపోవడానికి కారణమిదా?

Manchu Manoj: ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు నుంచి ఆయన కుమారులకు ఇండస్ట్రీలో పేరు వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇద్దరు కొడుకులు విష్ణు, మనోజ్ సినీ పరిశ్రమలో పెద్దగా రాణించటం లేదు. వీరు సినిమాల్లో కన్నా ట్రోల్స్ లోనే ఎక్కువగా గడిపేస్తుంటారు. ఈ మధ్య కాలంలో మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇది పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. తాజాగా మెుదటి భార్య నుంచి విడాకులు తీసుకోవటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మంచు మనోజ్ బాబు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మార్చ్ 3వ తేదీన దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015 వ సంవత్సరంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు మనోజ్. అయితే పెళ్లైన రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

 

అయితే మొదటి భార్యతో విడిపోవడంపై మనోజ్ తొలిసారి స్పందించాడు. తాజాగా మౌనికతో కలిసి మనోజ్, ఈటీవీలో ప్రసారం అయ్యే వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న అలా మొదలైంది షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మొదటి పెళ్లి మనోజ్ గురించి మాట్లాడారు.

 

ఫ్యామిలీ జీవితంలో ఎన్నో కష్టాలు పడినట్లు తెలిపారు. అంతే కాకుండా భార్య, భర్త మధ్య ఉండే ప్రేమ గురించి కూడా బాగా వివరించారు. ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. నేను ఇచ్చిన ప్రేమ పరస్పరం తిరిగి రాలేదు. నేను చాలాసార్లు ప్రణతి కోసం ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చింది. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది. ఒకానొక సమయంలో నేను ఎక్కడ నిలబడి ఉన్నాను. ఎవరికోసం నిలబడ్డానో తెలియక తికమక పడ్డాను. అప్పుడే విడాకులు తీసుకున్నానని మనోజ్ చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -