Ram Charan: రామ్ చరణ్ విషయంలో మెగాస్టార్ అలా వ్యవహరించారా?

Ram Charan: సినిమా లోకంలో అనేక కష్టాలు ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవారికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక వేళ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు కూడా ఎత్తు పల్లాలను చూడక తప్పదు. అటువంటి వారు స్టార్ ఇమేజ్ పొందేందుకు చాలా కష్టాలు భరించాలి. అలా కష్టపడకుంటే కనుమరుగైపోయే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా అనేక పరిస్థితులను ఎదుర్కొని ఈ స్థాయిలో నిలిచారు.

 

మెగాస్టార్ తర్వాత ఆయన వారసుడిగా రామ్ చరణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన నటనతో స్టార్ ఇమేజ్ ను చెర్రీ సొంతం చేసుకున్నాడు. రికార్డులు బద్దలు కొట్టి తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ నిలిచిపోయారు. సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ చాలా క్రమశిక్షణతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

 

రామ్ చరణ్ ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా సింపుల్ గా ఉంటూ ముందుకు వెళ్తుంటారు. అయితే రామ్ చరణ్ సినిమాల్లోకి రావడం చిరంజీవికి అస్సలు ఇష్టం లేదట. అందుకు ఓ బలమైన కారణమే ఉంది. చిరంజీవి సినీ ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడి మెగాస్టార్ అయ్యారు. తన తర్వాత వచ్చేవారికి అంతకుమించి కష్టాలనేవి ఉంటాయి. రామ్ చరణ్ ఆ స్థాయిలో ఇమేజ్ ను తెచ్చుకోకపోతే ప్రెజర్ భారీగానే ఉంటుంది.

 

అంతే కాకుండా తన ఇమేజ్‌ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా స్టార్‌ హీరోగా రాణించాలంటే ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది. చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే రామ్ చరణ్‌కు ఆ ఇబ్బందులు ఏవీ ఉండకూడదని చిరంజీవి ముందుగానే ఆలోచించారు. అందుకే రామ్ చరణ్ సినిమాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని పలుసార్లు కూడా ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఎదిగిన తీరు చూస్తుంటే మెగాస్టార్ చాలా సంతోషిస్తున్నారు. తండ్రికి తగ్గ కొడుకు అంటూ సినీలోకం రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

BJP: బీజేపీ కూటమికి బలం అవుతుందా.. బలహీనత అవుతుందా.. ఇంత దారుణమైన పరిస్థితులా?

BJP:  భారతదేశంలో బీజేపీ కి ఎంత బలం ఉన్నా తెలుగు రాష్ట్రాల వద్దకు వచ్చేసరికి బీజేపీ బలం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎక్కువ మద్దతు లేకపోవడంతో బీజేపీ తెలివిగా...
- Advertisement -
- Advertisement -