Megastar Chiranjeevi: ఇలాంటి కథకు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా లీకులు బయటపడ్డాయి. అయితే ఇందులో ఏది వాస్తవమో.. ఏది అబద్ధమో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. కీలకపాత్రలో కనిపించనున్న రవితేజ, చిరంజీవి ఇద్దరూ సవతి సోదరుల పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో చాలా వరకు నిజం ఉందని సినీ వర్గాలు చెబుతున్నారు. స్టోరీ పూర్తిగా తెలియాలని అనుకుంటే సంక్రాంతి పండుగ వరకు ఎదురు చూడాలి. తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. రవితేజ కోసం చిరంజీవి అందరితో తిరగబడతాడని, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధమే చిరంజీవిని రెబల్‌గా మారుస్తుందని అంటున్నారు. దీంతో రవితేజకు, చిరంజీవికి ఉన్న రిలేషన్‌షిప్ అర్థమవుతుంది.

 

 

‘వాల్తేరు వీరయ్య’ మూవీలో రవితేజ పాత్ర 44 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. రవితేజ పాత్ర ఉన్నంతవరకు సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని, అలాగే చివరి ఎండింగ్ సీన్స్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అప్పటినుంచి వీరయ్య మాస్‌గా మారుతాడని ప్రచారం జరుగుతోంది. విలన్‌లపై వీరయ్య రివేంజ్ ఎలా తీసుకుంటాడు?. పూర్తి యాక్షన్ సీన్లతో వీరయ్య పాత్ర పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమా మొదట్లో వీరయ్య పాత్ర కామెడీగా కనిపించినా.. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతారని తెలుస్తోంది. అయితే సినిమా హిట్ కొడుతుందని అభిమానుల్లో సంతోషం ఉన్నా.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంపైనే కాస్త భయపడుతున్నారు. సినిమా బాగుందని అనుకునే సమయంలోనే.. పేస్ తగ్గిపోవడం వంటివి బాబీ సినిమాల్లో కనిపిస్తుంటాయి. అందుకే ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు అభిమానులను ఎంతగానో అలరించాయి. సినిమా ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే.. జనవరి 13వ తేదీ వరకు వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -