Pawan Kalyan: పవన్ ఫస్ట్ మూవీకి అంత తక్కువ పారితోషికం తీసుకున్నారా?

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఆయన వారసుడిగా పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అయితే ఇతరుల్లా పవన్ ఎప్పుడూ అన్నను పక్కన పెట్టలేదు. అలా చేసుంటే పవన పెద్ద స్టార్ అయ్యేవాడే కాదు. పవన్ తనకంటూ ఓ స్టైల్ ను, ఓ మేనరిజంను క్రియేట్ చేసుకున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరో అయ్యాడు. తిరుగులేని స్టార్ డమ్ తో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి..అనే సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను అల్లు అరవింద్ తెరకెక్కించారు. ఇది హిందీ మూవీ అయిన ఖయామత్ సే ఖయామత్ తక్ కు రీమేక్ సినిమా. ఇందులో అమీర్ ఖాన్ హీరోగా చేశారు.

 

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాహసాలు చేశారు. అదే అప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. చేతులపై కార్లు ఎక్కించుకుని, గుండెలపై బండరాళ్లు పగులగొట్టించుకునే వంటి సాహసాలు పవన్ చేశారు. నాగేశ్వరరావు మనవరాలు అయిన సుప్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమాకు గాను అల్లు అరవింద్ తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చాడో పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఆ సినిమా మొత్తానికి తనకు రూ.5000లు పారితోషికంగా ఇచ్చారని తెలిపాడు. మరి ఇప్పుడు ఆయన మార్కెట్, స్టార్ డమ్ రీత్యా రూ. 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఆ లెక్కన పవన్ రెమ్యూనరేషన్ చాలా రెట్లు పెరిగింది.

 

ప్రస్తుతం పాలిటిక్స్ కారణంగా పవన్ కళ్యాణ్ 2018 తర్వాత కొంత కాలం పాటు బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ కమ్ బ్యాక్ ప్రకటించిన ఆయన వరుసగా చిత్రాలు చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. ఇందులో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నారు. అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఇప్పటికే మొదలైంది. అలాగే సాహో దర్శకుడు సుజీత్ తో ఇంకో సినిమా చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -