Pawan Kalyan: ప్రీతి మృతి గురించి పవన్ కళ్యాణ్ అలా అన్నారా?

Pawan Kalyan: గత ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి ఈ లోకాన్ని విడిచింది డాక్టర్ ప్రీతి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ నేరస్తుడిని కూడా అరెస్టు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఇక ఆ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మాత్రం తమ కాలేజీలో ర్యాగింగ్ లేదంటూ చెప్పుకోవటంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రీతి గ్రామస్తులు, తమ వర్గానికి చెందిన వాళ్లు మీడియా ముందుకు వచ్చి ఆమెకు జరిగిన అన్యాయం గురించి గట్టిగా ప్రశ్నించారు. ఎలాగైనా న్యాయం జరగాలి అని కోరారు.

కానీ ప్రీతి మాత్రం బ్రతకలేకపోయింది. చివరి వరకు వైద్యులు కూడా ఆమెకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. కానీ ఆదివారం రోజు ఆమె తుది శ్వాస విడిచింది. దీంతో ఈ విషయం తెలియడంతో అందరూ బాగా ఆవేదన చెందుతున్నారు. సినీ, రాజకీయ నాయకులు కూడా ఈ విషయం గురించి స్పందిస్తున్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తున్నారు. అయితే తాజాగా ప్రీతి మరణం పట్ల సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించాడు.

 

డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని అన్నాడు. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని అన్నాడు. ప్రీతి నీ సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన కూడా.. కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు అని.. ఆ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అని అన్నాడు.

 

ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ వేధింపులు అరికట్టడం పై ప్రభుత్వం వైఖరి అవలబించాలి అని.. సీనియర్ విద్యార్థుల ఆలోచనా ధోరణి మారాలి అంటూ.. కొత్తగా కాలేజీ లోకి వచ్చిన వాళ్లను స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల ఆదరించాలి అంటూ.. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపటం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి అంటూ స్పందించాడు పవన్ కళ్యాణ్.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -