Prabhas: ఆ సీక్రెట్ తో ప్రభాస్ నిజస్వరూపం బయటపడిందా?

Prabhas: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల విధానం ఒక్కో రకంగా ఉంటుంది. వారు ఏం చేసినా అది పబ్లిక్ లోకి వెళ్లిపోతుంది. పర్సనల్ లైఫ్ లోని అనేక విషయాలు పబ్లిక్ కు తెలుస్తుంటాయి. దీంతో వారిపై కొన్ని సార్లు విపరీతంగా ట్రోల్స్ జరుగుతుంటాయి. మీమ్స్, ట్రోల్స్ వల్ల వారి పర్సనల్ లైఫ్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే వారు చాలా వరకూ సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించరు.

 

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 షోలో సందడి చేశారు. ఈ షోలో బాలయ్య అడిగే ప్రశ్నలు మామూలుగా ఉండదు. చిలిపి ప్రశ్నలు, సీక్రెట్ విషయాలు అడుగుతూ సెలబ్రిటీలను బాలయ్య ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఈ సారి అన్ స్టాపబుల్ 2 షోలో ప్రభాస్ చాలా విషయాలను బాలయ్యతో పంచుకున్నారు.

 

సోషల్ మీడియాలో హీరో ప్రభాస్ గురించి రూమర్స్, గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఒక్క ప్రభాస్ గురించే కాదు చాలా మంది సెలబ్రిటీల గురించి పలు వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ప్రభాస్ ఈ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడని సమాచారం.

 

ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరని ఆయన ఫ్యాన్స్ భావిస్తుంటారు. అయితే ప్రభాస్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ యూజ్ చేస్తారని సమాచారం. తనపై వచ్చే ట్రోల్స్ గురించి ఎప్పటికప్పుడు ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటాడని తెలుస్తోంది. ప్రభాస్ అన్ స్టాపబుల్ షోలో పదేపదే సోషల్ మీడియా గురించి, ట్రోల్స్ గురించి చెబుతూ వచ్చారు. దీంతో ట్రోల్స్ అంటే ప్రభాస్ కు ఇంత భయమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -