Upasana: పిల్లల కోసం రామ్ చరణ్ భార్య ఏకంగా అలాంటి పనులు చేశారా?

Upasana: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో భార్య, మెగా కోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా కూడా ఈమె మనందరికీ సుపరిచితమే. ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఉపాసన. అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ తన మంచి మనసును చాటుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఉపాసన ప్రస్తుతం 7 నెలల గర్భవతి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

మరో రెండు నెలల్లో మెగా వారసుడు రాబోతున్నాడు. కాగా మెగా వారసుడు కోసం అటు మెగా ఫ్యామిలీ ఇటు మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఇలా ఉంటే ఇటీవలే ఉపాసన తన ప్రెగ్నెన్సీ సీక్రెట్ ని బయటపెట్టింది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లయి 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటివరకు తాను పిల్లల్ని ఎందుకు కనలేదు అన్న విషయాన్ని వెల్లడించింది. పెళ్లయిన తర్వాత ఉపాసన దంపతులు 10 ఏళ్లకు శుభవార్తను చెప్పిన విషయం తెలిసిందే.

 

పెళ్లయి పదివేలు అవుతున్నా కూడా అసలు బేబీ ప్లానింగ్ లో లేము. దానికి కారణం మా మైండ్ సెట్. మేము మా బేబీని పెంచగలిగే మైండ్ సెట్ సంపద మాకు ఉన్నప్పుడే మేము పిల్లల్ని కనాలి అనుకున్నాము. అప్పటివరకు ఎగ్స్ ని ఫ్రీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాము అని ఉపాసన చెప్పుకొచ్చింది మొదటి నుంచి చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కావడంతో మా ఆలోచనలు ఒక్కటయ్యాయి. అందుకే ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నాము అని చెప్పుకొచ్చింది ఉపాసన. నేను నా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వడానికి,వారసుడిని ఇవ్వడానికి పిల్లల్ని కనడం లేదు అని ఉపాసన చెప్పడంతో అధి కాస్త సంచలనంగా మారింది.. ఈ క్రమంలోనే ఉపాసన ఎన్ని మాట్లాడినా కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో మెగా ఫాన్స్ హర్ట్ అవుతున్నారు . దీంతో మెగా కోడలు ఉపాసన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -