Revanth: తండ్రి విషయంలో రేవంత్ కు అలాంటి కష్టాలు ఎదురయ్యాయా?

Revanth: టాలీవుడ్ టాప్ సింగర్స్ లో రేవంత్ కూడా ఒకరు. పాటల ప్రేమికులకు ఈయన గురించి బాగా తెలుసు. పాటల తోటలో రేవంత్ సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. టాప్ సింగర్ నుంచి తప్పుకుంటున్న తరుణంలో రేవంత్ ఇండియన్ ఐడల్ కు వెళ్లి పార్టిసిపెంట్ చేశాడు. తన సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నాడు. టైటిల్ విన్నర్ అయ్యాడు. అదే ఫామ్ లో ప్రస్తుతం బిగ్ బాస్ లోనూ కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ లో విజయానికి ఇంకొంత దూరంలో రేవంత్ ఉన్నాడు. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనేది తేలనుంది. ముఖ్యంగా ఈ సారి బిగ్ బాస్ టైటిల్ గెలిచేది రేవంత్ అని అందరూ అనుకుంటున్నారు.

 

రేవంత్ కుటుంబ సభ్యుల ఇంట సంబరాలు కూడా మొదలయ్యాయి. తమ కొడుకు తప్పకుండా విన్నర్ అవుతాడని, టైటిల్ తీసుకుని ఇంటికొస్తాడని రేవంత్ తల్లి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రేవంత్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాడని ఆమె చెప్పుకొచ్చింది. రేవంత్ చిన్ననాటి సంగతులు చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

 

తన భర్త పేరు శంకర అని, రేవంత్ కడుపులో ఉండగానే ఆయన చనిపోయారని కన్నీటిపర్యంతమైంది. తమ పుట్టింటివాల్లే తమకు బాగా చూసుకున్నారని, అమ్మ, నాన్న, వదినలు, అన్నలు బాగా చూసుకునేవారని, వారి వల్లే తాము సంతోషంగా బతుకుతున్నామని తెలిపింది. తమ కుటుంబీకులే లేకపోతే రోడ్డున పడేవారిమని తెలిపింది. తన ఇద్దరు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ నాన్న లేడనే లోటును తీర్చారని అన్నారు.

 

రేవంత్ కు నాన్న లేడని చెబితే బాధపడతాడని, అందుకే తన తండ్రి దుబాయ్ లో ఉన్నట్లు చెప్పేవారిమని తెలిపారు. అస్తమానం తన తండ్రి వచ్చేందుకు అవకాశం లేదని, ఫోన్ చేస్తే సరిపోతుందని చెప్పేవారిమని పేర్కొంది. రేవంత్ ఇప్పటికీ వాళ్ల నాన్నను చూడలేదని, అందుకే వాడ్ని చూస్తే నాకు బాధేస్తుందని తెలిపింది. రేవంత్ జీవితంలో ఆ ఒక్క లోటూ ఇప్పటికీ అలానే ఉండిపోయిందని రేవంత్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -