Sai Dharam Tej: ఆ సినిమాకు నో చెప్పి సాయితేజ్ మంచి పని చేశారా?

Sai Dharam Tej: హీరోలు సినిమా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్ఫెక్ట్ గా వినాలి. బాగోలేకున్నా, తనకు సెట్ కాకున్నా చెప్పేయాలి. లేదంటే ఆ సినిమా వల్ల వచ్చే ప్లాప్ ఆ హీరోకు పెద్ద దెబ్బ వేసేస్తుంది. అవసరాల శ్రీనివాస్ కథకు మొహమాట పడ్డాడు హీరో నాగశౌర్య.రెండు సినిమాలు తనతో చేసారు అన్న మొహమాటం.కానీ గమ్మత్తేమిటంటే అలాంటి నాగశౌర్య పేరునే ప్రమోషన్ ఫంక్షన్లలో వేదిక మీద చెప్పడానికి ఇష్టపడలేదు అవసరాల శ్రీనివాస్.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అన్నది ఓ టిపికల్ సినిమా.కథ కన్నా కథనం కీలకం.ఇలాంటి కథను ఒప్పుకోవడం ఓ విధంగా రిస్క్ నే. సినిమాలో హీరోయిన్ ఎంత ఏజ్ గ్యాప్ లు వున్నా ఒకేలా కనిపిస్తూ వుంటుంది.హీరో మాత్రం ఏకంగా వేరు వేరు గెటప్ ల్లో వయసు మారుతూ కనిపిస్తాడు.దీని కోసం శౌర్య బోలెడు శ్రమ తీసుకోవాల్సి వచ్చింది.బోలెడు కాల్ షీట్లు వేస్ట్ చేసుకుని గెడ్డం పెంచుతూ,తగ్గిస్తూ కాలం గడపాల్సి వచ్చింది.కానీ ఫలితం లేకపోయింది.

 

ఈ కథ ముందుగా మరెవరెవరి దగ్గరకు వెళ్లిందో తెలియదు. కానీ సాయి ధరమ్ తేజ‌ దగ్గరకు మాత్రం వెళ్లింది.ఫస్ట్ సిటింగ్ లోనే నో చెప్పేసాడు ఆ మెగా హీరో.అదీ ఆ క్లారిటీ, ఆ నిర్మొహమాటం వుండాలి.అది లేకపోతే కష్టం. మరీ ముఖ్యంగా కెరీర్ మీద తీవ్రంగా దెబ్బపడుతోంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -