Chaitanya: చైతన్యపై పగ తీర్చుకోవడానికే సమంత అలా చెప్పిందా?

Chaitanya: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సమంత పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సమంత ఏం మాట్లాడినా కూడా ఆ మాటలు సెన్సేషనల్ అవుతున్నాయి. అక్కినేని హీరో నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమె గురించి సోషల్ మీడియాలో ప్రతి నిత్యం వార్తలు షికారు చేస్తున్నాయి.

 

తాజాగా సమంత నటించిన పాన్ ఇండియా సినిమా యశోద విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పలు కీలక విషయాలను తెలియజేసింది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తన వ్యాధి గురించి సమంత చెప్పడంతో కొంత సింపతి కూడా క్రియేట్ అయ్యిందనే చెప్పాలి.

 

యశోద సినిమా ప్రమోషన్స్ సమయంలో సమంత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. ఈమె ఒక రకంగా అక్కినేని హీరోలకు కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది. ఆ టైంలో సమంత తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

 

జీవితం మనకు నచ్చినట్లు ఉండాలని, మనం మెచ్చినట్లు బతకాలి అని, ఎవర్నీ సంతోషపెట్టడానికో మనం పుట్టలేదని, ఒకరి కింద అణిగి ఉండాల్సిన పరిస్థితి అవసరం లేదని సమంత తెలిపింది. దేన్నైనా సరే తట్టుకుని నిలదొక్కుకునే స్టామీనా ఉండాలని తెలిపింది. అప్పుడు జీవితంలో ముందడుగు వేస్తామని వెల్లడించింది. సమంత చేసిన కామెంట్స్ పరోక్షంగా అక్కినేని హీరోలకు ఘాటుగా ఇచ్చిపడేసిందని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం సమంత మాట్లాడిన మాటలు మింగుడు పడక ఫైర్ అవుతున్నారు. ఏదైమైనా సమంతో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత మాటలు అక్కినేని హీరోలను టార్గెట్ చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -