Sharmila: తక్కువ సమయంలో షర్మిలకు ఆ విధంగా బెయిల్ వచ్చిందా?

Sharmila: తాజాగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు అయిన షర్మిల తెలంగాణ పోలీసులపై చేయి చేసుకోవడంతో ఆమెను చంచల్ గూడా జైలుకి తరలించిన విషయం తెలిసిందే. పోలీసులపై ఆమె ఉద్దేశ్యం పూర్వకంగానే దాడి చేసింది అంటూ ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విజయమ్మ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా షర్మిల ఒక్క రాత్రి చంచల్ గూడా జైల్లో ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఆమెను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ కూడా జైలుకు వెళ్లారు. షర్మిలను పరామర్శించి బయటకు వచ్చిన గంటలోనే షర్మికులకు బెయిల్ మంజూరు అయ్యింది.

అదే జైల్లో భాస్కర్ రెడ్డి తో పాటుగా ఉదయ్ కుమార్ రెడ్డి ఇతర వివేకానంద హత్య కేసులో నిందితులు ఉన్నారు. పోలీసులు ఆమెను అడ్డుపడడం ఆమె చేయి చేసుకోవడం జైలుకు వెళ్లడం జైలు నుంచి బెయిల్ రావడం ఇవన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. పోలీసులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసి తన డ్రైవర్‌తో ఓ కానిస్టేబుల్ ను ఢీ కొట్టమని ఆదేశించి కాలికి గాయమయ్యేలా చేసినా పోలీసులు చాలా ఉదారంగా వ్యవహరించారు. మామూలుగా అయితే హత్యాయత్నం కేసు పెట్టి ఉండేవారు. కానీ అలాంటి కేసులు పెట్టలేదు. 332, 353, 509, 427 ఐపీసీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

 

బెయిల్ వచ్చే సెక్షన్లే కావడంతో నాంపల్లి కోర్టులో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాదించారు. అంతే కాకుండా వైయస్ విజయమ్మ ఈ విషయంపై వివరణ ఇస్తూ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. కానీ పోలీసులు విజయమ్మ పై ఎటువంటి కేసులు పెట్టలేదు. ఆమెపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. అయితే వైయస్ షర్మిల జైలుకు వెళ్లి వివేకా హత్య కేసులో వారిని నేరుగా కలవలేక ఇలా పోలీసులపై దాడి చేసి జైలుకు వెళ్లి వారిని పరామర్శించినట్లు తెలుస్తోంది. విజయమ్మ కూడా పరామర్శ పేరుతో వారిని కలిసినట్టుగా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -