Sridevi: శ్రీదేవి అలాంటి పనులు చేసిందా.. ఏకంగా సీఐనే బెదిరిస్తూ?

Sridevi: టాలీవుడ్ నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వివాదాస్పద నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది శ్రీరెడ్డి.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో శ్రీ రెడ్డి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటల వీడియోలు చేస్తూ అందులో వంటల కంటే ఆమె అందాలు ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తూ తన పని తాను ఏదో చేసుకుంటూ వెళుతోంది. ఆ వంటలు చేస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సమాజంలో జరిగే వాటిపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువగా జనసేన పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది.

 

అలాగే వైసిపి పార్టీపై ఎవరైనా నెగిటివ్గా కామెంట్స్ చేసే వారిపై ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీరెడ్డి వైసిపి నుంచి బహిష్కరణకు గురైన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై షాకింగ్ కామెంట్స్ చేయడంతో పాటు ఆమె బాగోతం గురించి బయట పెట్టింది. ఇప్పటికే వైసీపీ నేతలు ఆమెపై మండిపడడంతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా ఆమె ఎన్నికలలో ఓటు వేసింది అని తెలుసుకొని ఆమె కార్యాలయం పై దాడి కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకుండా గతంలో జగన్ ని పొగుడుతున్న వీడియోని ఇప్పుడు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ మహానటి అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

 

గతంలో ఇసుక వాహనాలను తరలిస్తున్న క్రమంలో పట్టుబడిన వాహనాలను విడిచి పెట్టాలని ఎమ్మెల్యే శ్రీదేవి సిఐ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అంతేకాకుండా ఆ సీఐని బెదిరిస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆడియో పై తాజాగా శ్రీ రెడ్డి స్పందించింది. ఆడియో పై శ్రీరెడ్డి స్పందిస్తూ..కసి కసిగా మత్తుగా మాట్లాడే.. మన కస్సక్.. పేకాట ఆంటీ శ్రీదేవి కీ ఎంత పొగరో.. ఈ తాజా తాజా వాయిస్ కూడా వినండి అయ్యా అంటూ ఒక ఆడియో ని సోషల్ మీడియాలో విడుదల చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -