Samantha: స్టార్ హీరోయిన్ సమంత అలాంటి పనులు చేయడానికి ఓకే చెప్పిందా?

Samantha: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో చర్చలకు తీసుకువస్తూ భారీ స్థాయిలో సెలబ్రిటీలను ట్రోల్ చేస్తున్నారు.ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలతో పాటు వారి గ్లామర్ గురించి చర్చించుకునే నటీమణులలో సమంత ముందు వరుసలో ఉంటారు.

సమంత పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె విడాకులు తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి. శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత త్వరలోనే ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ సిరిస్ అయినప్పటికీ దీనిని ఇండియన్ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా ఈ సిరీస్లో చాలా బోల్డ్ గా నటించారు. ఏకంగా బెడ్ రూమ్ సన్నివేశాలలో చాలా రొమాంటిక్ గా ఈమె నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో కూడా అలాంటి రొమాంటిక్ సన్నివేశాలే ఉంటాయా అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది.

 

అయితే ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఇండియన్ వెర్షన్ లో ఉండబోవని ఇలాంటి సన్నివేశాలలో సమంత నటించడం లేదని తెలుస్తుంది. సమంత కంటెంట్ ఉన్న సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె ఇదివరకే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ఎన్నో బోల్డ్ సన్నివేశాలలో నటించారు. దీంతో ఈమె ఈ తరహా సన్నివేశాలలో నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయదని మరికొందరు భావిస్తున్నారు.

 

ఇక హాలీవుడ్ వెర్షన్ లో మాదిరిగా ఇండియన్ వెర్షన్లో ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి బహుశా కుదరకపోవచ్చని,పలువురు భావిస్తున్నారు. మరి సమంత కూడా ఈ సిరీస్ లో అలాంటి సన్నివేశాలలో నటించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సిరీస్ లో ఈమె బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ ని కూడా ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ మీద దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -