Ram Charan:చరణ్ తండ్రి కాబోతున్నాడని తెలిసి తారక్ అలా చేశారా?

Ram Charan:మెగా కుటుంబం మొత్తం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతుండటమే. ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే మెగా స్టార్ చిరంజీవి గారే స్వయంగా ప్రకటించారు. తాను తాత అయ్యే శుభ సందర్భాన్ని తన సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించారు చిరంజీవి. ఈ క్రమంలో మెగా అభిమానులు అందరు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. మెగా అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తుండటంతో నెట్టింట్లో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

 

మెగా కోడలు ఉపాసన తల్లి అవుతుండటంతో.. రామ్ చరణ్ – ఉపాసనలకు అభిమానులతో పాటు పెద్దలూ ఆశీర్వాదాలు తెలుపుతున్నారు. ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ సందర్బంగా చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయం తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ చాలా సంతోషించాడట. అంతే కాదు తాను ఉపాసనకు కావాల్సిన అన్ని వస్తువులను, ప్రత్యేకంగా పళ్ళు పంపించి శుభాకాంక్షలు తెలిపారట. దీనితో మరోసారి చరణ్ – తారక్ ల మధ్య స్నేహం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు అభిమానులు.

 

తారక్ – చరణ్ ల బలమైన స్నేహం.
మొదటి నుండీ తారక్ మరియు చరణ్ చాలా మంచి మిత్రులు. ఈ విషయం చాలా సార్లు బయటపడింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా వారిద్దరూ తమ స్నేహం గురించి మాట్లాడారు. అప్పుడు కూడా తారక్ చరణ్ ల స్నేహం చూసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇక ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే తారక్ ఇండియాలో లేకపోయినా కూడా.. చీరె సారె పండ్లు ఫలాలు పంపించాడు.

 

అవధుల్లేని ప్రేమాభిమానాలతో అన్నలా తనను చూస్తున్న తారక్ పంపిన బహుమతి చూసి ఉపాసన ఒకింత ఉద్వేగానికి గురయ్యారట. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారట. దీనితో మెగా – నందమూరి స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నట్టు అభిమానులు, తెలుగు సినీ ప్రియులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఈ కాంబోలో మరో సినిమా తీయాలని కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -