Ram Charan: ఆ హీరోయిన్ రామ్ చరణ్ కు జోడీగా, తల్లిగా నటించారా?

Ram Charan: సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకు రంగుల ప్రపంచాన్ని చూపించే ఓ అద్భుతం. ఈ అద్భుత ప్రపంచంలో మన ఊహలకు కూడా అందని వాటిని మన దగ్గరకి సినిమా రూపంలో చేరుతుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్లు ఎవరు అనేది. చాలామంది హీరో, హీరోయిన్ల కాంబినేషన్లు అద్భుతంగా ఉంటే, మరికొన్ని జంటలు సూపర్ హిట్, కొన్ని మాత్రం కాస్త వింతగా అనిపిస్తుంటాయి.

 

మరీ ముఖ్యంగా ముదురు హీరోల విషయానికి వచ్చినప్పుడే హీరోయిన్ల సెలెక్షన్ డైరెక్టర్లకు, నిర్మాతలకు ఇబ్బందిగా మారుతుంది. అయితే తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోగా సాగుతున్న రామ్ చరణ్ తేజ్ తో జత కట్టిన ఓ హీరోయిన్ ఇప్పుడు అతడికి ఏకంగా తల్లిగా మారిపోయిందట. అవును.. తెలుగులో మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ తేజ్ కి జోడీ కట్టిన హీరోయిన్ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.

 

విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురిగా అరంగేట్రం చేసి, తర్వాత తన ట్యాలెంట్ తో అవకాశాలు కొట్టేస్తున్న హీరోయిన్ శృతి హాసన్. తెలుగులో అప్పుడప్పుడు హిట్ సినిమాల్లో మెరుస్తున్న శృతి హాసన్.. ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో జోష్ ని చూపుతోంది. చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’లో మరియు బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో శృతి హాసన్ నటిస్తోంది.

 

చిరంజీవి కొడుకు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రొమాన్స్ చేసిన శృతి హాసన్ ఇప్పుడు.. తండ్రి చిరంజీవితో జత కట్టడంతో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీలో కుర్ర హీరో రామ్ చరణ్ కు జోడిగా, తల్లిగా నటించిన హీరోయిన్ గా శృతి హాసన్ రికార్డు సాధించిందంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చ ఎలా ఉన్నా కానీ శృతి హాసన్ మాత్రం సినిమాలకు వయసుతో సంబంధం లేదనే క్లారిటీ ఇచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -