NTR: ఆ ఒక్క పొరపాటే తారక్ కెరీర్ కు శాపంగా మారిందా?

NTR: పాన్ ఇండియా కల్చర్ మొదలయ్యాక స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వారి మార్కెట్ కూడా భారీగా పెరిగిందని చెప్పాలి. దీన్ని ఇలానే కాపాడుకుంటే బావుంటుంది. లేకుంటే మరిన్ని నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5కి ఫిక్స్ చేశారు.

 

ఏప్రిల్ నెలలో రెండు వారాల్లో ఏడు రోజులు సెలవులు వస్తాయనే పాజిటివ్ కోణంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నా ఇంకో పదిహేను నెలలకు పైగా ఎదురు చూడాలనే బాధ మాత్రం అలానే ఉంది. తారక్ డై హార్డ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ వార్త చాలా బాధిస్తోంది. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఆ బాధ తప్పేంకాదని తెలుస్తోంది. రాబోయే మార్చికి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ యానివర్సరీ కూడా జరుపుకోనుంది. అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవ సినిమాకు కూడా తారక్ చాలా గ్యాప్ ఇచ్చాడు.

 

ఇకపోతే ఆర్ఆర్ఆర్ క్రెడిట్ మొత్తం తారక్ కు రాకుండా రామ్ చరణ్, రాజమౌళికి వెళ్లింది. పైగా ఆ సినిమాలో తారక్ క్యారెక్టర్ కు తగినంత న్యాయం జరగలేదనే ఫీలింగ్ ఇప్పటికీ ఫ్యాన్స్ మనసుల్లో ఉంది. అలాంటప్పుడు వాళ్ళను సంతృప్తి పరిచేందుకు వీలైనంత వేగంగా తారక్ సినిమాలు రావాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. తొందరపడితే డిజాస్టర్లు వస్తాయేమోననే భయం కూడా ఉంది.

 

ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తారక్ కు ఇమేజ్ వచ్చింది. వచ్చిన ఆ ఇమేజ్ ని ఇంకా పెంచుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ తాపత్రయ పడుతున్నాడు. ఎన్టీఆర్ 30 సినిమా వచ్చేలోగా పుష్ప 2, సలార్, రామ్ చరణ్ 15, ఆది పురుష్ లాంటి పాన్ ఇండియా సినిమాలు వచ్చేస్తాయి. అప్పుడు తారక్ వాటిని మించేలా తన సినిమా తీసి సత్తా చూపాల్సి ఉంటుంది. అంచనాలను పూర్తి స్థాయిలో అందుకుంటేనే బ్లాక్ బస్టర్ హిట్ గా ఆ సినిమా నిలుస్తుంది. ఏది ఏమైనా యంగ్ టైగర్ ఆలోచనా ధోరణి, ఈ నెమ్మదితనం ఎలాంటి ఫలితం ఇస్తుందోనని ఫ్యాన్స్ కి ఆందోళన కలుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు...
- Advertisement -
- Advertisement -