Sneha Ullal: టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత మాయమైపోయిన నటీమణులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఒకరు. ఒకప్పుడు ఈమెను టాలీవుడ్ ఐశ్వర్యరాయ్‌గా పిలిచారు. కొన్ని సినిమాల్లో మంచి అవకాశాలే అందిపుచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత క్రమంగా తెరమరుగైంది ఈ బ్యూటీ. చేసిన కొన్ని సినిమాల్లోనూ హాట్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేయడానికి నిరాకరించిందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే, ప్రస్తుతం అవకాశాలు పూర్తిగా సన్నగిల్లడంతో తన పంథా మార్చుకుందని సమాచారం.
ప్రస్తుతం ఐటమ్ సాంగ్‌లలో నటించడానికి కూడా సిద్ధమైందట స్నేహా ఉల్లాల్. అయితే, హీరోయిన్గా నటించిన స్నేహా ఉల్లాల్.. తనకు అవకాశాలు దక్కకపోవడానికి కారణాలను వెల్లడించింది. తొలుత ఐటమ్ సాంగ్స్ చేయడం ఇష్టం ఉండేది కాదని తెలిపింది. ఇలా చేయడానికి పూర్తి వ్యతిరేకమని చెప్పింది. అయితే, ప్రస్తుతం మనసు మార్చుకున్నానని చెప్పింది.
తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది స్నేహా ఉల్లాల్. తర్వాత కరెంట్, యాక్షన్ త్రీడీ లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇవి కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక వ్యక్తిగత కారణాలతో 2015 ఏడాది నుంచి క్రమంగా సినిమాలకు దూరమైంది ఈ బ్యూటీ. అయతే, తాజాగా గతేడాది మళ్లీ సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది స్నేహా ఉల్లాల్. లవ్ యూ లోక్ తంత్ర మూవీలో మెరిసింది.
ఆ నిర్ణయం వల్లే దూరమయ్యా..
సినిమాలకు దూరం కావడానికి కారణాలు రీసెంట్గా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. కొన్ని కారణాల వల్ల తాను గీసుకున్న గీత.. తన కెరీర్ అర్ధంతరంగా దెబ్బతినిందని తెలిపింది. గతంలో ఐటం సాంగ్స్ అవకాశాలు వచ్చినా తాను రిజెక్ట్ చేశానని తెలిపింది. ఈ నిర్ణయమే తనను ముందుకు సాగనీయకుండా చేసిందని చెప్పింది. ఎక్స్పోజింగ్ విషయంలో లైన్ గీసుకొని ఉండేదాన్నని తెలిపింది. అందుకే అవకాశాలు రాలేదని తెలిపింది. లేదంటే టాప్ హీరోయిన్గా వెలుగొందేదాన్నని తెలిపింది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌లో అప్పియరెన్స్ ఇస్తానని స్పష్టం చేసింది స్నేహా ఉల్లాల్.