Actress: లెస్బియన్ వివాహాల గురించి ఆ స్టార్ హీరోయిన్ అలా అన్నారా?

Actress: ఈ సమాజంలో ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళికి ఎంతో మంచి గౌరవం ఉంటుందని చెప్పాలి అలా కాకుండా లెస్బియన్ వివాహాలు చేసుకుంటే ఆ వివాహాన్ని ఒక తప్పుగా భావిస్తూ ఉంటారు. అయితే లెస్బియన్ వివాహాల గురించి నటి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళకి భూమి పెడ్నేకర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

2017 వ సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయమైన నటి
భూమి పెడ్నేకర్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అవసరమైతే ఇంటిమేట్ సన్నివేశాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ‘లస్ట్ స్టోరీస్’ లో పనిమనిషి పాత్రను పోషించానని ఈమె చెప్పకనే చెప్పేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భూమి లెస్బియన్ వ్యవహారాల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

2020 లో వచ్చిన ‘బదాయి దో’లో ఈమె చేసిన లెస్బియన్ రోల్ కి ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం సుప్రీం కోర్టులో జరుగుతున్న స్వలింగ వివాహం చర్చలపై ఈమె మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా భూమి మాట్లాడుతూ ఈ ప్రపంచం అందరికీ సమానమైన న్యాయమైన ప్రదేశంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలియజేశారు.దేవుడు మనల్ని ఒకే థ్రెడ్ నుంచి సృష్టించాడు అని నేను భావిస్తున్నాను. ఒక సంఘానికి మిత్రురాలిగా దీనిపై తీర్పు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

 

LGBTQIA + కమ్యూనిటీలో నాకు చాలా మంది మిత్రులున్నారు. ఒక చిన్న మార్గం ద్వారా నేను వారి సమస్యలకు ప్రాతినిధ్యం వహించి వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో నేను కూడా భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ఈమె తెలియజేశారు. లెస్బియన్స్ వివాహం చేసుకుంటే తప్పులేదు అంటూ పరోక్షంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -