Balayya: ఆ ఛాలెంజ్ వల్లే వాల్తేరు వీరయ్య సక్సెస్ అయిందా?

Balayya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణకు తన జాతకం ఏందో తెలుసు. తాను తీసుకున్న నిర్ణయం.. తనకంటే ప్రత్యర్థికే ఎక్కువగా కలిసొస్తుంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. బాలయ్య చేసిన ఛాలెంజ్ ఆయనకు కలిసి రాకపోయినా.. మెగాస్టార్ చిరంజీవికి, మైత్రీ మూవీ మేకర్స్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు.

 

 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘వీరసింహారెడ్డి’ సినిమాను డిసెంబర్‌-2022లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు బాలయ్య.. ఈ సినిమాను సంక్రాంతి బరిలో పోటీగా నిలపాలని అనుకున్నారు. అప్పుడు నిర్మాతలు కూడా బాలయ్య మాటకే కట్టుబడ్డారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా సంక్రాంతికే రిలీజ్ కావడంతో.. రెండు సినిమాలు నష్టాలు చవి చూస్తాయని భయపడ్డారు. కానీ దానికి భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి.

 

 

ఒకరోజు తేడాతో రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అభిమానులు సైతం ప్రెష్టేజ్‌గా ఫీల్ అయ్యారు. ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టేలా చేయాలని భావించారు. తొలి రోజు అభిమానులు సినిమా టికెట్లు కొని అందరికీ పంచారు. అయితే చాలా వరకు థియేటర్లకు ముందు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టినా.. లోపల సీట్లు ఖాళీగానే దర్శనమిచ్చినట్లు సమాచారం. ఇదంతా తమ హీరో రికార్డు కోసం ట్రై చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి కమ్మేతర, తెదేపాయేతర సమూహాలు కూడా చిరంజీవి సినిమా టికెట్లు కొని పంచడం మొదలు పెట్టారు.

 

 

అయితే ప్రేక్షకులు మాత్రం వాల్తేర్ వీరయ్యకే పట్టం కట్టారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో యాక్షన్ సీన్స్ తప్పా.. ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం. సైకలాజికల్ ప్రకారం కేవలం ఒక వర్గానికి మాత్రమే ఆకట్టుకుంది. ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్ సీన్లు కూడా ప్రేక్షకులను అలరించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్‌ టాక్‌ను సంపాదించుకుంది. అయితే కథ పరంగా కూడా రెండు సినిమాలు ఒకలాగే అనిపిస్తాయి. రెండు సినిమాల్లోనూ తలలు తెగపడ్తాయి. వీరసింహారెడ్డిలో చెల్లి చస్తుంది.. వాల్తేరు వీరయ్యలో తమ్ముడు చస్తాడు. అయినప్పటికీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఏపీ సీఎం జగన్‌కు ఎటువంటి మేండేట్ ఇచ్చారో.. బాలకృష్ణకు వ్యతిరేకంగా తన సినిమాతో వచ్చినన చిరంజీవికి కూడా అదే మేండేట్ ఇచ్చారు. అయితే ఈ రెండూ సినిమా సంక్రాంతి కాకుండా మూమూలు రోజుల్లో విడుదలైతే ఘెరంగా దెబ్బతిని ఉండేవి. కానీ బాలయ్య తన సినిమాని పక్కన పెట్టి చిరంజీవి సినిమాకు కలిసొచ్చేలా చేశాడని టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -