Mahesh: తండ్రి మరణం మహేష్ ను ఇంతలా బాధ పెట్టిందా?

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ఈ ఏడాది పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహేష్ బాబు కుటుంబంలో ముగ్గరు మరణించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన కృష్ణ మరణించడం ఇప్పటికీ మహేష్ బాబు కుటుంబంతో పాటు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ చనిపోయిన తర్వాత మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగభరిత పోస్టును పెట్టారు.

 

కృష్ణ చనిపోయిన తర్వాత మహేష్ బాబు రూమ్ లో ఒంటరిగా కృంగిపోయారట. దాదాపుగా రెండు రోజులపాటు ఆయన పచ్చి గంగైనా ముట్టలేదట. కుటుంబ సభ్యులు, ఆయన భార్య నమ్రత బలవంతంగా ఆయనకు ఆహారం, నీరు ఇచ్చినట్లు తెలుస్తోంది. తండ్రి అంటే మహేష్ బాబుకు అమితమైన ప్రేమ. ఒక్కసారిగా ఆయన లేరని తెలిసే సరికి మహేష్ బాబు తీవ్ర మనోవేదన అనుభవించినట్లు తెలుస్తోంది.

 

ఈ ఏడాదిలో మహేశ్ బాబు కుటుంబంలో ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు జరిగాయి. సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు మహేశ్ బాబును కలచివేశాయి. మహేష్ బాబు తన తండ్రి చనిపోయిన తర్వాత భావోద్వేగ పోస్టు చేశారు. ఇప్పటి వరకూ జీవితం చాలా గొప్పగా సాగిందని, తుదిశ్వాస వరకూ ధైర్యంగా జీవించారని, ధైర్యం, సాహసం మీ స్వభావాలు, నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

 

గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత దృఢంగా ఉన్నట్లు అనిపిస్తోందని, ఇప్పుడు తనకెలాంటి భయం లేదని, ఎప్పటికీ నాకు అండగా ఉంటారన్న ధైర్యం ఉందని మహేష్ బాబు ఆ ట్వీట్ లో తెలిపాడు. కృష్ణ ఆశీస్సులతో ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని, అందరూ గర్వపడేలా నడుచుకుంటానని, లవ్యూ నాన్న అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో తెలిపాడు. తండ్రంటే మహేష్ బాబుకు అంత ప్రేమ. కుటుంబంలో ముగ్గురు పెద్ద దిక్కులను కోల్పోయినా మహేష్ బాబు మనసును నిలకడ చేసుకున్నారు. తన భార్య, బిడ్డలకు తోడుగా ముందుకు సాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -