Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి కొత్త హీరోయిన్లు వస్తే పాతవారు ఇండస్ట్రీకి దూరం కావడం సర్వసాధారణం.అయితే తమ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే కొంతమంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కాగా మరికొందరు రీ ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్రతారాలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోయిన్స్ పెళ్లి చేసుకొని చాలా మటుకు విదేశాలలో స్థిరపడ్డారు. ఇలా పెళ్లి తర్వాత విదేశాలలో స్థిరపడిన హీరోయిన్లు ఎవరో ఓ లుకేసేద్దాం…
లయ:స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లయ తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే డాక్టర్ గణేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.తాజాగా ఇండియా వచ్చిన ఈమె రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ప్రియాంక చోప్రా: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతున్నటువంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ లలో నటిస్తూ హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పాప్ సింగర్ ను పెళ్లి చేసుకొని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడ్డారు.
రంభ: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగిన రంభ అనంతరం బిజినెస్ మెన్ ఇంద్ర కుమార్‌ని పెళ్లాడి టొరొంటోలో కాపురముంటుంది.
అంకిత: సింహాద్రి లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలలో నటించిన అంకిత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని న్యూ జెర్సీలో నివాసం ఉంటుంది.
కీర్తి రెడ్డి: హీరోయిన్ కీర్తి రెడ్డి సుమంత్ ను వివాహం చేసుకొని విడాకులు ఇచ్చారు. అనంతరం ఈమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు.
అన్షు అంబానీ:నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ద్వారా అందరిని ఆకట్టుకున్నటువంటి ఈమె లండన్ లో ఉంటూ క్లోతింగ్ బిజినెస్ లో రాణిస్తున్నారు.
గోపిక:నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తమిళం మలయాళం సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు. డాక్టర్ ను పెళ్లి చేసుకున్న గోపిక పెళ్లి తర్వాత ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.
రీచా గంగోపాధ్యాయ్: లీడర్, మిరపకాయ్, మిర్చి వాటి సినిమాలలో నటించిన రిచా గంగోపాధ్యాయ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు.
మీరాజాస్మిన్: తెలుగు మలయాళ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీరాజాస్మిన్ పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు భర్తతో కలిసి అబ్రాడ్ లో నివసించారు.అనంతరం తన భర్తకు విడాకులు ఇవ్వడంతో తిరిగి ఇండియాకి వచ్చి సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
కలర్స్ స్వాతి: యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిగా సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కలర్స్ స్వాతి వివాహం చేసుకున్న తర్వాత భర్తతో కలిసి యూఎస్ లో నివసిస్తున్నారు. అయితే ఈమె తాజాగా పంచతంత్రం అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.