Movies: ఈ తెలుగు భారీ బడ్జెట్ సినిమాలు సీరియళ్లలా ఉండటం వల్లే ఫ్లాపయ్యాయా?

Movies: టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు, కొత్త హీరోల సినిమాలు చాలా విడుదల అవుతూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలు రెండు సంవత్సరాలు ఒకటి విడుదల అయితే.. యంగ్ హీరోలు, కొత్త హీరోల సినిమాలు చాలా విడుదల అవుతూ ఉంటాయి. కథలో ఉన్న కొత్తదనంను బట్టి సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. రోటిన్ స్టోరీలకు భిన్నంగా కొత్త కథతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

అయితే కొన్ని సినిమాలు సీరియళ్లలా ఉంటాయి. కథ బాగా స్లోగా ఉండటంతో పాటు సినిమా సీరియళ్లకు తగ్గట్లు ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వస్తుంటాయి. సీరియళ్లలా ఉన్నాయని టాక్ తెచ్చుకుని ఫ్లాఫ్ అయిన తెలుగు సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మత్సవం సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది. మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ సినిమాగా ఇది నిలిచింది. కాజల్, సమంత అభిమానులకు సైతం ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా సీరియల్ చూసినట్లు ఫీలింగ్ కలుగుతుంది. ఇక నితిన్, రాశిఖన్నా కాంబోలో వచ్చిన శ్రీనివాస కల్యాణం సీరియల్ చూసినట్లు ఉంటుందనే కామెంట్లు వచ్చాయి. శృతి మంచిన డ్రామా ఉండటం వల్ల ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

ఇక ఇటీవల సమంత ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమాపై కూడా ఇలాంటి విమర్శలే వస్తోన్నాయి. ఈ సినిమాను చూస్తుంటే సీరియల్స్ గుర్తొస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఇలా టాలీవుడ్ లో అనేక సినిమాలు సీరియల్స్ చూశామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించాయి. సిల్వర్ స్క్రీన్ సినిమాకు తగ్గట్లు కథ, కథనం లేకపోవడంతో ఈ సినిమాలపై సీరియల్స్ అనే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇలాంటికి అనేక సినిమాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -