Jathi Ratnalu: నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం జాతి రత్నాలు.ఈ సినిమా కరోనా సమయంలో థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయాన్ని నిర్మాతలు కూడా ఏమాత్రం ఊహించలేదని తాజాగా ఈ సినిమా గురించి నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా వీరి బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం అన్నీ మంచి శకునములే ఈ సినిమా ఈనెల 18వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి స్వప్న ప్రియాంక జాతి రత్నాలు సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి స్వప్న మాట్లాడుతూ ఈ సినిమా కరోనా సమయంలో విడుదలైందని తెలిపారు.
ఇక ఈ సినిమాకు అప్పుడే ఓటీటీలో బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది. ఈ సినిమాని మేము థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని భావించాము. ఇక ఓటీటీ ఆఫర్ కూడా మంచిగా రావడంతో ఇవ్వాలని నిర్ణయించుకున్నాను కానీ ప్రియాంక దత్ హస్బెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలని పట్టుబడ్డారని తెలిపారు.అప్పుడే కరోనా థియేటర్లకు జనాలు వస్తారో రారో కూడా తెలియదు కానీ నాకు అశ్విన్ మాత్రం ఈ సినిమా సక్సెస్ అయితే భారీ సక్సెస్ అవుతుందనీ తెలిపారు.
ఈ సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు మనకు ఇంకా చాలా వయసు ఉంది. డబ్బు సంపాదించుకోవచ్చు అంటూ ఈ సినిమాని థియేటర్లో విడుదల చేసినట్టు తెలిపారు.ఇలా ఫ్లాప్ అవుతుందనుకున్న ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయామని తెలిపారు. ఇలా చిన్న సినిమాగా విడుదలయ్యి ఎంతో పెద్ద సక్సెస్ అందుకుందని చెప్పాలి.ఇక తమ బ్యానర్ లో వచ్చిన మహానటి, సీతారామం సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు అన్ని మంచి శకునుములే సినిమాకి కూడా ఇలాంటి సక్సెస్ అందించాలని ఈమె కోరుకున్నారు.