Upasana: విమర్శలు చేసిన వాళ్లకు ఉపాసన గట్టిగా సమాధానం ఇచ్చిందా?

Upasana: ఏ దంపతులైనా అమ్మానాన్నలు కాబోతున్నారంటే వారికి అంతకుమించిన శుభవార్త మరేదైనా ఉంటుందా చెప్పండి. సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని జంటలు ఇంకా పిల్లలు లేకుండా ఉన్నాయి. సెలబ్రిటీలు తలచుకుంటే సరోగసి ద్వారా పిల్లలను కనేస్తూ వెళ్లిపోతున్నారు. మరికొందరు మాత్రం తమ పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ఇటీవలె తెలిపారు.

 

వీరికి వివాహం అయ్యి పదేళ్లు అవుతోంది. పదేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులు అవుతుండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే ఈ స్టార్ కపుల్ సహజ పద్దతిలో కాకుండా సరోగసి ద్వారా పిల్లలని కనబోతున్నారంటూ చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీని గురించే వార్తలు షికారు చేస్తున్నాయి.

 

అయితే ఈ వార్తలన్నింటికి ఒక్క ఫోటోతో ఉపాసన చెక్ పెట్టిందనే చెప్పాలి. ఫ్యామిలీ పార్టీ ఉండడం వల్ల చరణ్ ఉపాసనతో కలిసి ఈ మధ్యనే థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి సంతోషంగా గడిపారు. తాము ఎంజాయ్ చేస్తున్న తమ ఇద్దరి ఫోటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలో ఉపాసన బేబీ బంప్‌తో కనిపించడంతో ఉపాసన సరోగసి వార్తలపై నేరుగా స్పందించక పోయినా, ఆ వార్తలకి చెక్ పెట్టినట్లు అయ్యిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగనుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది. శంకర్ సామాజిక అంశాలను కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శంకర్ , రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -