Vishal-Varalakshmi: మాటలు రాని యువతిని ప్రేమించిన విశాల్.. గ్రేట్ అంటూ?

Vishal-Varalakshmi: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు విశాల్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగానే కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అంతేకాదు.. స్టార్‌ హీరోగా రాణిస్తున్న విశాల్‌ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలను కూడా చేపడుతున్నాడు. ఇక విశాల్ ఎప్పుడూ ఏదో వార్తలో నిలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో గాసిప్స్ రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయనకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విశాల్ ఇండస్ట్రీలో కొంతమంది నటులతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. విశాల్ అప్పట్లో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. కానీ కొద్దిరోజుల తర్వాత విశాల్ హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటనతో విశాల్‌ నటనపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఆయన వరుస సినిమాలతో బిజీగా రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో విశాల్ వరుసగా షూటింగ్‌లో గాయపడ్డాడు.

ఇక విశాల్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తపై హీరో విశాల్ స్పందించలేదు. కానీ అభినయ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అభినయ నాడోడిగల్‌ చిత్రంతో నటిగా తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆమె మూగ, చెవిటి యువతి అన్న విషయం అందరికి తెలిసిన విషయమే.

అయినా ఆమెలో ఉన్న లోపాలను జయించి అభినయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. వీరిద్దరిపై వస్తున్న వార్తలపై అభినయ స్పందిస్తూ.. ప్రస్తుతం విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మార్క్‌ ఆంటోనీ’. ఈ సినిమాలో విశాల్‌కు కేవలం భార్యగా నటిస్తున్నానని వెల్లడించింది. రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తాం.. కానీ రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా? అని ప్రశ్నించారు. ఇలాంటి పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -