Waltair Veerayya: జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి వాల్తేరు వీరయ్య తీశారా?

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి మనల్ని థియేటర్లలో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. సంక్రాంతికి అసలు పండగ కల తెచ్చిన చిరంజీవి.. పూర్తిస్థాయి పండగ భోజనం లాంటి సినిమాను అందించాడు. చాలాకాలం తర్వాత మెగాస్టార్ కూడా భారీ కలెక్షన్లు రాబట్టగలిగే సినిమా చేశాడు. సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా వంద కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

మెగా అభిమానులు తిరిగి గర్వంగా కాలర్ ఎగరేసేలా చేసిన ‘వాల్తేరు వీరయ్య’ గురించిన ఓ వార్త ఇప్పుడు.. మెగా అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన సినిమాకు కాపీ అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్్ చేసిన సినిమానే చిరంజీవి కొత్తగా చేశాడనే ప్రచారం నెటిజన్లకు ఆసక్తిని, మెగా అభిమానులకు కోపాన్ని తెప్పిస్తోంది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాకు కాపీనే చిరు ‘వాల్తేరు వీరయ్య’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో వీరయ్య తన తమ్ముడు డ్రగ్స్ కేసులో ఇరుక్కొని చనిపోతాడు. దాంతో పోలీస్ డిపార్ట్ మెంట్ అతడిని ద్రోహిగా ముద్ర వేస్తుంది. నిజానికి ప్రకాశ్ రాజ్ వల్ల ఇలా జరిగినా.. చిరంజీవి వల్లే ఇలా జరిగిందని రవితేజ భార్య అనుకుంటుంది. రంగంలోకి దిగిన చిరంజీవి తన తమ్ముడు ద్రోహి కాదు అని నిరూపిస్తాడు.

ఇక ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమా విషయానికి వస్తేహీరోయిన్ తమన్నా తన అన్న కిక్ శ్యామ్ ను అనుకోకుండా డ్రగ్స్ కేసులో కోల్పోతుంది. అతడి మీద డిపార్ట్ మెంట్ ద్రోహిగా ముద్ర వేస్తుంది. దాంతో తమన్నా ఎన్టీఆర్ ను తన అన్నను చంపిన వారిని చంపాలని కోరుతుంది. ఎన్టీఆర్ అందరినీ చంపుతూ.. కిక్ శ్యామ్ నిజాయితీని ప్రపంచానికి తెలియజేస్తాడు.

ఇలా ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్లు, జెండర్ వేరుగా ఉన్నా కానీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే అనే పాయింట్లు అందరిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. చిరంజీవి చేసిన ‘వాల్తేరు వీరయ్య’కు ఎన్టీఆర్ చేసిన ‘ఊసరవెల్లి’కి పోలికలు ఉన్నాయనే వార్త మాత్రం వాస్తవం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -