Bandla Ganesh: బండ్ల గణేష్ అడల్ట్ సినిమాల్లో నటించాడని మీకు తెలుసా?

Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటుడిగా, కమెడియన్ గా, నిర్మాతగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ పేరు చెబితే పూనకాలు వచ్చేసేలా మాట్లాడుతుంటారు బండ్ల గణేష్. పవన్ సినిమా ఫంక్షన్లలో ఆయన ఇచ్చే స్పీచులు ఎంతో వైరల్ అయ్యాయి. వీటితోపాటు పలు ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాయి.

 

ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పుకునే బండ్ల గణేష్​.. ఏ అంశం మీదనైనా తన అభిప్రాయాలను నిర్భయంగా చెబుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా అడల్ట్ సినిమాల్లో నటించడానికి గల కారణాలను కూడా ఆయన పంచుకున్నారు. చిన్నస్థాయి నటుడ్ని అయిన తనకు సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారని గణేష్ తెలియజేశారు.

 

మొత్తం జీవితం దానికే సరిపోయింది: బండ్ల గణేష్
‘వినోదం’ సినిమాతో తనకు మంచి గుర్తింపు దక్కిందన్న గణేష్.. ఆ తర్వాత కూడా అవకాశాల కోసం ఎన్నోమార్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఈరోజు నిర్మాతగా ఎదిగానంటే అందులో ఎంతోమంది సహాయం కూడా ఉందన్నారు. కానీ యాక్టర్ గా మాత్రం ఎప్పుడూ తాను పూర్తిస్థాయిలో పెద్దగా సంతృప్తి చెందలేదన్నారు. జీవితాంతం కూడా చాన్సుల కోసం తిరగడానికే సరైపోయిందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

 

సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో మధ్యలో ఒకసారి ‘సారీ ఆంటీ’ అనే అడల్ట్ మూవీలో తాను నటించడంపై బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. ‘అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే నిర్మాత నట్టి కుమార్ వచ్చి ఓ సినిమాలో హీరో పాత్ర అని చెప్పారు. అప్పట్లో అలా లీడ్ రోల్స్ దొరకడమే గొప్ప. అదే ఆశతో ఆ సినిమాలో నటించా. కానీ మూవీ షూట్ మొదలుపెట్టిన తర్వాత అసలు విషయం తెలిసింది. అప్పట్లో నాలాంటి యాక్టర్స్ కు ముందే కథ చెప్పే చాన్స్ లేదు. చిత్రీకరణ మొదలైన తర్వాత ఏమీ లేదు.. పైకి, కిందకి అని చెప్పారు. ఇక నేను కూడా ఏదో ఉంటుంది అనుకుని సినిమా చేశా. అందులోకి దిగాక అసలు విషయం అర్థమైంది. ఇక ఆ తర్వాత మళ్లీ అలాంటి చిత్రాలు చేయలేదు’ అని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -