Nagarjuna Remuneration: గోస్ట్ సినిమాకు నాగార్జున రెమ్యూనేషన్ తీసుకోలేదని మీకు తెలుసా?

Nagarjuna Remuneration: టాలీవుడ్ ప్రేక్షకులకు అగ్రస్టార్ హీరో నాగార్జున గురించి పెద్దగా పరిచయంకర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జున సొంతం.

ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా హడావిడి చేస్తున్నాడు నాగ్. ఇక ఈ దసరా కు కానుకగా నాగార్జున ది గోస్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహన్ మెప్పించబోతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో విడుదలయ్యే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు ఈ సినిమా గట్టి పోటీ ఇస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నటించినందుకు నాగార్జున రెమ్యూనేషన్ తీసుకోలేదట. దాదాపు 6 నుంచి ఏడు కొట్ల వరకు పుచ్చుకునే నాగార్జున ఈ సినిమాకు రెమ్యూనేషన్ తీసుకోలేదు.

కానీ ది గోస్ట్ సినిమాపై ఉన్న నమ్మకంతో నాగార్జున రెమ్యూనేషన్ కి బదులుగా 4 ఏరియాల థియేట్రికల్ హక్కులు తీసుకున్నట్లు తెలుస్తుంది. వైజాగ్ ఈస్ట్, వెస్ట్ , గుంటూరు ఏరియాల్లో ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్స్ నుంచి పంపిణీ కానున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలు అన్ని నిజం అయితే నాగార్జున తను తీసుకునే రెమ్యూనేషన్ కి మించి వసూళ్లను రాబడతాడు. కాగా ఈ సినిమాలో నాగార్జున తెలుగు ప్రేక్షకుల ఏవిధంగా మెప్పిస్తాడో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ ల నేపథ్యంలో నాగ్ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -