Heroes: ఈ హీరోలు ఇండస్ట్రీకి దూరమయ్యారని మీకు తెలుసా?

Heroes:  సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇందులోకి ఎందరో వస్తూ ఉంటారు మరి ఇంకెందరో వెళ్తూ ఉంటారు. చిత్ర పరిశ్రమలో వారసత్వంగా వచ్చి సక్సెస్ సాధించిన హీరోలు ఉన్నారు అలాగే సొంతగా తమ కాళ్ళ మీద కష్టపడి నిలబడి చరిత్ర సృష్టించిన హీరోలు ఉన్నారు. కానీ కొంతమంది ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి అర్ధాంతరంగా కనుమరుగైన తారలు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. మరి ఇండస్ట్రీలో స్టార్ డంను సంపాదించి ఆ తర్వాత సడన్గా కనుమరుగైన టాలీవుడ్ హీరోల గురించి ఈరోజు తెలుసుకుందాం.

 

తరుణ్

బాలనట్లుగా పలు చిత్రాలలో మరియు సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తరుణ్. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాష్ట్ర మరియు జాతీయ అవార్డులు కూడా సంపాదించి చిన్నతనంలోనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 2000 లో నువ్వే కావాలి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ అతను కెరియర్ లో పెద్దగా నిలబడలేకపోయాడు. కొన్ని చిత్రాల్లో నటించిన తరుణ్ క్రమంగా కనుమరుగైపోయాడు.

రోహిత్

సిక్టీన్స్,గర్ల్ ఫ్రెండ్ మంచి చిత్రాలలో యూత్ లో మంచి పాపులర్ పాపులారిటీ తెచ్చుకున్న నటుడు రోహిత్. అప్పట్లో కొన్ని చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన రోహిత్ క్రమంగా వెండితెర నుంచి కనుమరుగైపోయాడు. అతను చివరిసారి నటించిన చిత్రం నవవసంతం (2007).

 

ఆకాష్

ఆనందం చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి తరంగేట్రం చేసిన హీరో ఆకాష్. మొదటి మూవీ తోటే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఎక్కువ ఛాన్సులు రాకపోవడంతో కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. కానీ ప్రస్తుతం ఎటువంటి సినిమాలు చేయడం లేదు.

 

వేణు

స్వయంవరం చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన వేణు తర్వాత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల గోపి గోపిక గోదావరి చిత్రం తరువాత వేణు లైమ్ లైట్ కి దూరంగా ఉన్నాడు. ఎన్టీఆర్ దమ్ము మూవీలో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత తిరిగి రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.

 

హీరో రాజా

ఓ చిన్నదాన మూవీతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు రాజా. తరవాత శేఖర్ కమల ఆనంద్ మూవీతో బాగా పాపులర్ అయ్యాడు. కానీ అనుకోని కారణాలవల్ల సడన్గా సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయాడు.

 

వడ్డే నవీన్

కోరుకున్న ప్రియుడు, పెళ్లి చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్ ఒక దశకం పాటు తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సృష్టించాడు. కానీ అనుకోని కారణాల వల్ల క్రమంగా సినీ ఇండస్ట్రీకి దూరమైపోయాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -