Heroines: ఈ హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భవతులు అయ్యారని తెలుసా?

Heroines: ప్రేమలో పడటం ఎక్కడైనా కామనే. ఇక సినీ ఇండస్ట్రీలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా సినీ పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల మీద సాధారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ అనే కాదు.. టాలీవుడ్ సహా అన్ని భాషల సినీ నటీ నటుల ఇతర టెక్నీషియన్లు ప్రేమలో పడుతున్నారు.పెళ్లి కూడా చేసుకుంటున్నారు. కానీ ఒక ఆసక్తికరమైన ప్రచారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ మధ్య జీరో సైజ్ నడుము హీరోయిన్ ఇలియానా తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. దీంతో తండ్రి ఎవరంటూ ఆమెపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. అయితే ఇలా పెళ్లి కాకుండా, తల్లిగా మారిన హీరోయిన్ ఇలియానా ఒక్కరే కాదు. ఈ జాబితా చాలా పెద్దది. అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి వారు ఉన్నారు. బాలీవుడ్ మరింత ఎక్కువ సంఖ్య ఉంది.

 

కొద్దికాలం క్రితం రణ్ బీర్ కపూర్ తో అలియాభట్ కు పెళ్లి అయ్యింది. ఆ తర్వాత కొంత కాలానికి బాంబ్ పేల్చింది.పెళ్లైన కొన్ని రోజులకే తను గర్భందాల్చినట్టు ప్రకటించి, ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది అలియా భట్. అయితే పెళ్లికి ముందే తాను గర్భందాల్చిన విషయాన్ని ఆమె బయటపెట్టింది.

 

నటి నేహా ధూపియా వ్యవహారం కూడా దాదాపు ఇలాంటిదే. ఆమె కూడా పెళ్లికి ముందే గర్భందాల్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు హుటాహుటిన నేహాధూపియా, అంగద్ బేడీకి పెళ్లి చేశారు. 2018 మే నెలలో వీళ్ల పెళ్లి జరిగితే, ఆ ఏడాదిలోనే బిడ్డకు జన్మనిచ్చింది నేహా. దీన్ని బట్టి ఈ జంట కూడా ఎంత స్పీడ్ గా ఉందో బాగా అర్ధం చేసుకోవచ్చు.

 

ఇలాంటి లీస్ట్ లో మరికొంత మంది కూడా ఉన్నారు. వారు దియా మీర్జా, కల్కి కొచ్లిన్. 2021లో పెళ్లికి ముందే దియా మీర్జా గర్భందాల్చింది. కల్కి కొచ్లిన్ కూడా పెళ్లికి ముందే 2020లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వీళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -