Vijay: విజయ్ జుట్టు గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Vijay: మామూలుగా ఈ మధ్య కాలంలో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సామాన్యులకు మాత్రం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలటం వంటి సమస్యలు తెచ్చుకుంటున్నారు. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ నిండు జుట్టుతో మంచి హెయిర్ స్టైల్ తో కనిపిస్తూ ఉంటారు. అయితే నిజానికి చాలా మంది హీరోలకు నిజమైన హెయిర్ లేదని చెప్పవచ్చు.

వాళ్లకు కూడా హెయిర్ సమస్యలు వస్తుంటాయి కాబట్టి వాళ్లు కూడా విగ్ లేదా ట్రాన్స్ ప్లాంట్ చేయించుకుని ఉంటారు. ప్రస్తుతం కొంతమంది యంగ్ హీరోలు ఇప్పటికీ విగ్ వాడుతున్నారు. ఇక మరి కొంతమంది ప్రతిసారి విగ్ ధరించలేక ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారు. అయితే అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఉన్నాడని అర్థమవుతుంది.

 

హీరో విజయ్ కి కూడా జుట్టు సమస్య ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్న ఈయన ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తున్నాడని చెప్పాలి.. అయితే నటుడు, దర్శకుడు చిత్ర లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అందులో ఆయనకు విజయ్ సినిమాల్లో విగ్గు వాడతాడు అన్న ప్రశ్న ఎదురయింది.

 

దాంతో అతను స్పందిస్తూ.. నిజానికి విజయ విగ్ వాడడని.. ఆయన గతంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు అని అసలు నిజం బయటపెట్టాడు. ఇక కేవలం విజయ్ మాత్రమే కాదు అని తమిళంలో మరికొంతమంది హీరోలు కూడా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు అని ఆయన అన్నాడు. ఇక ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్ హెయిర్ స్టైల్ గురించి తెలిసిన వాళ్లంతా ఈయనకు హెయిర్ నిజంగా లేదా అంటూ షాక్ అవుతున్నారు. అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -