Balayya 108: బాలయ్య 108 మూవీ టైటిల్ విషయంలో ఈ విషయాన్ని గమనించారా?

Balayya 108: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భగవత్ కేసరి. ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. బాలయ్య స్టయిల్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను పొందిస్తున్నట్లు టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. బాలయ్య మోడ్ లోకి అనిల్ రావిపూడి పూర్తిగా మారిపోయినట్లు టీజర్ చెప్పేసింది.

కానీ అదే టీజర్ లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మాత్రం, అనిల్ రావిపూడి స్టయిల్ ను దాచాం లోపల ఇంకా చాలా వుంది అన్నట్లు చెప్పేసారు. కళ్లలో కళ్లు పెట్టి చూడు సాంగ్ ను బాలయ్య మీద కొత్తగా ప్లే చేసారు అంటే అనిల్ రావిపూడి ఎంటర్ టైన్ మెంట్ వ్యవహారమే. కానీ అంతకు ముందు టీజర్ లో మొండివాడు రాజకన్నా బలవంతుడు అనే మీనింగ్ వచ్చే డైలాగు, బాలయ్య స్టయిల్ హిందీ డైలాగు, మాంచి భారీ యాక్షన్ కట్, ఓ మాస్ గ్రూప్ సాంగ్ బిట్ ఇవన్నీ మాస్ కోసం అందించిన ఫుల్ మీల్సే అనుకోవాలి.

 

మొత్తంగా బాలయ్య బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం తప్పనిసరి అని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల చర్చలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఈ భగవత్ కేసరి సినిమా దసరా పండుగ విడుదల కానుంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -