Pawan Kalyan: ఈ దేవుడి షూ కోసం ఏకంగా అన్ని లక్షలు ఖర్చు చేశారా?

Pawan Kalyan: సినీ తారలలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రత్యేకత వేరు. ఆయన అభిమాన హీరో కాదు అభిమానుల గుండెల్లో దేవుడు అంతే. అయినా సినిమా రిలీజ్ అయింది అంటే చాలు పండగ వాతావరణం నెలకొంటుంది. ఆయన ఒక సినిమా మొదలుపెట్టారు అంటే ఎండింగ్ అయ్యే వరకు ఏదో ఒక న్యూస్ ట్రెండింగ్ లో ఉంటుంది.

అలాంటి న్యూసే ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రో అనే సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి హీరోల లుక్స్ విడివిడిగా రిలీజ్ అయ్యాయి. కానీ ఇద్దరు కలిసినా ఫోటోను ఇప్పటివరకు విడుదల చేయలేదు. రీసెంట్ గా ఆ ఫోటోని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

 

ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే కాకపోతే ఈ దేవుడు చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. అయితే పోస్టర్లో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా స్టైలిష్ గా కనిపించాడు. చాలా ఖరీదైన షూ తో అందరినీ ఆకర్షించాడు. దాని ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే. ఇక దేవుడు షూ వేసుకుంటాడా.. దేవుడు మోడరన్ బట్టలు వేసుకుంటాడా.. ఇలాంటి లాజిక్కులు అడగకూడదు మరి.

 

సినిమాల్లో దేవుడు వేసుకుంటాడు అంతే. అవసరమైతే విదేశాల నుంచి కూడా తెప్పించుకొని మరీ వేసుకుంటాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూ ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు. వామ్మో షూ కోసం అన్ని లక్షలు ఖరీదా అంటూ నోరెళ్ళబెడుతున్నారు నెటిజన్స్.

 

అలాంటి షూ 3 జతలు తెప్పించారంట మూవీ మేకర్స్. ప్యారిస్ కి చెందిన బాల్మెన్ కంపెనీకి చెందిన షూ ఇది. అంటే కేవలం షూ కోసమే మూడు లక్షలు ఖర్చుపెట్టారు. పైగా దేవుడి బ్రో కోసం కాస్ట్లీ లగ్జరీ బైక్ కూడా సెట్ చేశారంట. సినిమా మీద టైప్ ని పెంచడంలో ఈ పోస్టర్ తన పాత్రని బాగానే పోషించింది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -