YS Rajashekar Reddy: చిరు, నాగార్జున ఫోటో విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలా ప్రవర్తించారా?

YS Rajashekar Reddy: తెలుగు ప్రేక్షకులకు నటుడు మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు మురళి మోహన్. వ్యాపారం నుంచి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్ జగమే మాయా సినిమాతో సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే హీరోగా అనేక సినిమాలలో నటించి మెప్పించారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆడప దడపా సినిమాలలో నటిస్తున్నారు మురళీమోహన్.

అప్పుడప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆనాటి సంగతులను విషయాల గురించి కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా అసోసియేషన్ కి బిల్డింగ్ సీఎం పదవిలోకి వచ్చిన ఏ నాయకుడు ఆలోచించలేదని తెలిపారు. హైదరాబాద్ కు సినిమా ఇండస్ట్రీ తరలిరావడానికి దాదాపు 10 ఏళ్ల పైనే సమయం పట్టిందని తెలిపారు. భూమి ఇస్తే మా బిల్డింగ్ కడదామని అనుకుంటే ఏ సీఎం ఇవ్వలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ కి రామానాయుడు స్టూడియోస్ కి మధ్యలో కొంత భూమి ఏదైనా సినిమా ఇండస్ట్రీ అవసరాల కోసం వాడుకోమని ప్రభుత్వం తెలిపిన కూడా సాంక్షన్ చేయలేదు అని తెలిపారు.

 

అటు ఇస్తామని చెప్పకుండా ఇవ్వమని చెప్పకుండా చాలా ఏళ్ళు చేయడం వల్ల మా బిల్డింగ్ నిర్మాణం జాప్యం మయ్యింది అని తెలిపారు. ఎన్టీఆర్ సీఎం అయినా చంద్రబాబు సీఎం అయినా మా బిల్డింగ్ కి భూమి సాంక్షన్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి ఈ సినిమా పెద్దలందరూ వెళ్ళినప్పుడు నేను రానని చెప్పినా తీసుకెళ్లారు. ఆయనకు నన్ను చూస్తే నచ్చదు. టిడిపి వాడినని అందుకే వద్దని చెప్పినా వినకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లేకుండా ఎలా వెళ్తాము అని పిలుచుకొని వెళ్లిపోయారు. నాగేశ్వరరావు,చిరంజీవి, నాగార్జున మొదలైన ఆగ్ర హీరోలు అందరూ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్లగా మురళీ మోహన్ ఉన్నాడుగా ఇంకా ప్రభుత్వం భూమి ఇవ్వడం ఎందుకు తనని అడగండి అంటూ నవ్వాడు. దాంతో భూమి ఇవ్వడు అని అందరికీ అర్థం అయింది. దాదాపు 30 మంది సినిమా వాళ్ళందరూ వెళ్లి కలిసి ఒక ఫోటో తీసుకుందామని అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా నాకు సమయం లేదని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని తెలిపారు మురళి మోహన్. సమయంలో అందరూ అవమానంగా ఫీల్ అయ్యాము అని చెప్పుకొచ్చారు మురళీమోహన్.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -