Dimple Hayathi: ఈ టాలీవుడ్ హీరోయిన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Dimple Hayathi: తెలుగు సినిమా రేంజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. తెలుగు సినిమాలోని నటీనటులకు కూడా భారీ డిమాండ్ తో పాటు పాపులారిటీ కూడా వస్తోంది. తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్లకు కూడా భారీ డిమాండ్ ఉంటోంది. అయితే తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్ల జాబితాలో తెలుగు హీరోయిన్లు మాత్రం చాలా అరుదు. కానీ అలాంటి అరుదైన అవకాశాలను అందుకుంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి.

 

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరినీ ఊపేసిన డింపుల్ హయాతి.. తర్వాత కూడా చాలా సినిమాల్లో హల్ చల్ చేసింది. అందంలో ఏమాత్రం తీసిపోని ఈ తెలుగు హీరోయిన్.. సినిమాల విషయంలో వేస్తున్న స్టెప్స్ ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. డింపుల్ హయాతి తన కెరీర్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేలా చేస్తున్నాయి.

 

సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తున్న డింపుల్ హయాతి.. కథలో లేదంటే స్క్రీన్ మీద తాను ఎంత సేపు కనిపిస్తాననే విషయం మీద ఫోకస్ పెడుతుందట. సినిమాలో సాంగ్ ఎలా ఉన్నా, ఎలాంటి స్టెప్పులు ఉన్నా కానీ తాను స్క్రీన్ మీద కనిపించే టైం తనకు ఎంతో ముఖ్యం అని చెబుతోందట. అందుకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటే రెమ్యునరేషన్ తీసుకోవడానికి అమ్మడు ముందుకు వస్తోందట.

 

వేరే హీరోయిన్లు అయితే కేవలం రెమ్యునరేషన్ కోసం లేదంటే హీరోల పక్కన ఛాన్స్ కోసం చూస్తుంటే.. డింపుల్ హయాతి మాత్రం ఇలా తన స్క్రీన్ మీద కనిపించే టైంకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందట. అదే సమయంలో అమ్మడుకు పెద్దగా అవకాశాలు లేకపోయినా తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎంతకీ తగ్గడం లేదట. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కి నిర్మాతలు ఓకే చెబితేనే సినిమాకు సైన్ చేస్తోందట.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts