Dinesh Karthik: ఇషాన్, శుభ్‎మన్‎ల దెబ్బకు వన్డేలకు శిఖర్ ధావన్ దూరమైనట్లేనా?

Dinesh Karthik: టీమిండియాలో బ్యాటింగ్ లో అద్భుతాలు సృష్టించిన బెస్ట్ బ్యాట్స్ మెన్ గా శిఖర్ ధావన్ ఎంతోమంది హాట్ ఫేవరెట్. అతడు బ్యాట్ తో రఫ్ఫాడించడం మొదలు పెడితే బంతి బౌండరీల వైపు దూసుకెళ్లాల్సిందే. ఓపెనర్ గా అతడు స్టాండ్ తీసుకున్నాడంటే టీమిండియా భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రత్యర్థి బాలర్లకు చుక్కలు చూపించడం శిఖర్ ధావన్ కు మామూలే.

 

అయితే ఇదంతా ఒకప్పుడు శిఖర్ ధావన్ మంచి ఫామ్ లో ఉన్నప్పటి మాట. ఇప్పుడు మాత్రం అతడు పేలవమైన ప్రదర్శన ఇస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో అయితే మరీ దారుణంగా ఆడాడు. అతడు ఆడిన మూడు వన్డే మ్యాచుల్లో ఒక్క మ్యాచులో కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదంటే అతడి ఆట ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

 

ఒకప్పుడు బ్యాట్ ఝుళిపిస్తే బౌండరీలు దాటించే సత్తా ఉన్న శిఖర్ ఇప్పుడు మాత్రం కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేస్తే చాలు అన్నంతలా మారాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ధావన్ వరుసగా 7, 8, 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో శిఖర్ ధావన్ వన్డే కెరీర్ గురించి అంతటా చర్చ సాగుతోంది. వన్డే ఫార్మాట్ కు ఏమాత్రం అనుగుణంగా లేని శిఖర్ ఆటతీరుతో. . అతడు టీమిండియాలో కొనసాగుతాడా? అనే డైలమా సాగుతోంది.

 

ఇదే విషయాన్ని టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రస్తావించాడు. వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లే అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టీమిండియా వన్డే సిరీస్ లు ఆడాల్సి ఉండగా.. ఆ టోర్నీలకు ధావన్ కు జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ ఈ సిరీస్ లలో ధావన్ కు చోటు దక్కకపోతే వన్డే వరల్డ్ కప్ లో కూడా అతడి స్థానం గల్లంతైనట్లే అని దినేష్ కార్తీక్ అన్నాడు.

 

మరోపక్క అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలెక్టర్లు దూరం పెట్టలేరని దినేష్ కార్తీక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓపెనర్ గా రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే ధావన్ కు టీమిండియాలో చోటు దక్కడం అనుమానమే అని అన్నాడు. కాగా దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డట్లు శిఖర్ ధావన్ లో మునుపటి ఫైర్ కనిపించడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. పాత కాలపు అప్రోచ్ తో ఆడుతూ తీవ్ర నష్టం తెస్తున్నాడని, పవర్ ప్లేలో వేగంగా ఆడలేక ఇబ్బందిపడుతున్నాడని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -