Adipurush Row: ఆది పురుష్ టీజర్ అప్పటి రామాయణంలో సీతకు కూడా నచ్చలేదా?

Adipurush Row: టాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది పురుష్ సినిమా గురించి పరిచయం అక్కర్లేదు. కాగా ఈ సినిమా టీజర్ ఆదివారం రోజున విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలైనప్పటినుంచి విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటుంది. ఓవరాల్ గా మొత్తం టీజర్ లో యానిమేషన్ గ్రాఫిక్స్ కనబడుతుంది. దీంతో నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

కాగా ప్రభాస్ అభిమానులకు ఈ టీజర్ చాలావరకు కంటనీరు పెట్టిచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విషయంలో పలు హిందూ వర్గాలు కూడా బాయ్ కాట్ ఆది పురుష్ అంటూ పిలుపునిచ్చాయి. తాజాగా ఈ టీజర్ విషయంలో దీపికా చిక్లియా స్పందించింది. లెజెండ్రీ డైరెక్టర్ రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సిరీస్ ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ రామాయణం సిరీస్ లో సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియా కూడా ఈ టీజర్ గురించి కొన్ని నెగటివ్ కామెంట్లు చేసింది.

ఆది పురుష్ టీజర్ లో రావణాసురుడి పాత్రలో నటించిన సైప్ అలీ ఖాన్ లుక్ పై కొన్ని సెటైర్లు వేసింది. ఈ రావణాసురుడు శ్రీలంకకు చెందిన వాడు కాదేమో.. బహుశా అతడు మొఘలల రావణాసురుడు అయి ఉంటాడు అని విమర్శలు చేసింది. అలాగే వాల్మీకి తులసీదాస్ లు తమ అద్భుతమైన రచనలతో రామాయణ చరిత్రను అందించారు. ఆ రామాయణం కి గ్రాఫిక్స్ తో ఎలాంటి పని లేదు అని దీపికా తెలిపారు.

ఇక రామాయణాన్ని గ్రాఫిక్స్ తో ముడి పెట్టవద్దని ఆమె అన్నారు. నేను టీజర్ సరిగ్గా చూడలేదు కానీ హనుమంతుడి పాత్ర పై కూడా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి అని తెలిపింది. ఇక ఈ టీజర్ పై వచ్చే ట్రోల్స్ గురించి డైరెక్టర్ ఓం రౌత్ స్పందించాడు. ఈ సినిమా తీసింది పెద్ద స్క్రీన్ లో విడుదల చేయడానికి కానీ యూట్యూబ్లో విడుదల చేయడానికి కాదు. ఈ సినిమా థియేటర్లో చూస్తే అర్థమవుతుంది అన్నట్లు మాట్లాడాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -