Jr NTR: ఎన్టీఆర్ తో సినిమా ఏంటని డైరెక్టర్ ని తిట్టారట.. అతర్వాత?

Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ తో, డైలాగ్ డెలివరీతో, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచే నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన హీరో ఎన్టీఆర్.

సినిమాల్లోకి వారసత్వంతోనే వచ్చినా, ట్యాలెంట్ తో ఆ ముద్రను చెరిపేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో మూడో తరం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. సినిమాల కోసం ఏ కష్టాన్నైనా సహించే ఎన్టీఆర్.. సినిమా హిట్ అవడానికి తన పూర్తి మనసును పెడతాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ చంటి అడ్డాల తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక విషయాన్ని వెల్లడించాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా షూటింగ్ తన ఇంట్లో జరుగుతుండగా.. మొదటిసారి ఎన్టీఆర్ ని చూశానని.. అప్పుడే అతడు ఏదో సాధిస్తాడని అనిపించిదని చంటి అడ్డాల వెల్లడించారు.

ఆ తర్వాత తనతో సినిమా చేయాలని అనుకున్నట్లు వెళ్లి ఎన్టీఆర్ కు చెబితే.. అతడు ఓకే అన్నాడని చంటి అడ్డాల తెలిపాడు. అయితే ఎన్టీఆర్ తో సినిమా ఏంటని సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది అన్నారని, బుడ్డోడితో సినిమా ఏంటండి అని అన్నారని.. కానీ మొత్తానికి బి.గోపాల్ తో కలిసి సినిమా చేశామని అన్నాడు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ నేషనల్ స్టార్ హీరో అయ్యాడని, అతడిని ఎవరూ అందుకోలేరని ఆయన ప్రశంసించాడు.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -